ఘోర ప్రమాదం: డ్రైవర్ నిర్లక్ష్యానికి 11మంది బలి
ఆదివారం ఉదయం గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ముంబైకి చెందిన ఓ కుటుంబం జీపులో గుజరాత్‌లోని వల్లభీపూర్ ప్రాంతానికి వెళుతోంది.
గాంధీనగర్: ఆదివారం ఉదయం గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ముంబైకి చెందిన ఓ కుటుంబం జీపులో గుజరాత్‌లోని వల్లభీపూర్ ప్రాంతానికి వెళుతోంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును వీరి వాహనం ఢీకొంది.
ఈ ఘటనలో ట్రక్కులోని ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఓ బాలుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా, ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్ తప్పేంలేదని, జీపు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. జీపు డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు.












Click it and Unblock the Notifications