Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డొనాల్డ్ ట్రంప్ కంట పడకుండా మురికివాడలకు అడ్డుగోడ: అప్పట్లో బిచ్చగాళ్లను తరలించినట్టే..!

అహ్మదాబాద్: మరో 10 రోజుల్లో అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు రానున్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. తన పర్యటన సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో పర్యటించనున్నారు. సబర్మతీ ఆశ్రామాన్ని సందర్శించనున్నారు. ఎంపిక చేసిన కొందరు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. అక్కడిదాకా బాగానే ఉన్నప్పటికీ.. అక్కడే గుజరాత్ ప్రభుత్వం సాహసానికి పూనుకుంది.

Recommended Video

    Evening News Express : 3 Minutes 10 Headlines | Karnataka Bandh | Jagan Modi 2nd Meet
    మురికివాడలు కనిపించకుండా అడ్డుగోడ..

    మురికివాడలు కనిపించకుండా అడ్డుగోడ..

    డొనాల్డ్ ట్రంప్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని మురికివాడలు ఆయన కంట్లో పడకుండా.. అడ్డుగా గోడలను కడుతున్నారు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ఒక్కో గోడ ఎత్తు కనీసం ఆరు నుంచి ఏడు అడుగుల వరకు ఉంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఈ గోడలను కడుతోన్న విధానాన్ని, దానికి వాడే సామాగ్రిని చూస్తోంటే.. వాటిని శాశ్వతంగా అలాగే ఉంచేస్తారేమోననే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అంత భద్రంగా వాటిని కట్టిస్తున్నారు.

    విమానాశ్రయం నుంచి ఇందిరా బ్రిడ్జి వరకు

    విమానాశ్రయం నుంచి ఇందిరా బ్రిడ్జి వరకు

    గుజరాత్ రాజధాని గాంధీనగర్, ఆర్థిక రాజధాని అహ్మదాబాద్ మధ్య ఉండే సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం కనెక్టింగ్ రోడ్ వద్ద ఆరంభం అయ్యే ఈ గోడను.. ఇందిరా బ్రిడ్జి వరకు నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ఈ గోడ పొడవు అర్ధ కిలోమీటర్ నుంచి కిలోమీటర్ వరకు ఉంటుంది. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దాటుకుని బయటికి వచ్చిన తరువాత.. అహ్మదాబాద్‌‌ వైపు వెళ్లే మార్గానికి ఒక వైపున పెద్ద సంఖ్యలో మురికివాడలు ఉంటాయి. దేవ్ శరణ్ లేదా శరణి ఆవాస్ అని పిలుస్తుంటారు ఆ మురికివాడలను. అవి కనిపించకుండా ఈ అడ్డుగోడ కడుతున్నారని చెబుతున్నారు.

    సుందరీకరణ కూడా..

    సుందరీకరణ కూడా..

    గోడను కట్టడంతోనే ఆగిపోవట్లేదు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. దాన్ని సుందరీకరించనున్నారు. మొక్కలతో అలంకరించబోతున్నారు. సుమారు 2500 మొక్కలను నాటబోతున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొతెరాలోని సర్దార్ వల్లభ్‌భాయ్ స్టేడియం వరకూ నరేంద్ర మోడీ, డొనాల్డ్ ట్రంప్ రోడ్‌షోను నిర్వహించనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మురికివాడలు కనిపించనివ్వట్లేదని అంటున్నారు. 2017లో అహ్మదాబాద్‌లో నిర్వహించిన 12వ ఇండియా-జపాన్ వార్షిక సమ్మిట్‌లో పాల్గొనడానికి జపాన్ ప్రధానమంత్రి షింజో అబే రాక సందర్భంగా కూడా ఇలాంటి గోడే కట్టిందని అంటున్నారు.

    హైదరాబాద్‌లో బిచ్చగాళ్లను తరలించినట్టే..

    హైదరాబాద్‌లో బిచ్చగాళ్లను తరలించినట్టే..


    ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో బిల్ క్లింటన్ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో బిల్ క్లింటన్ రాకపోకలు సాగించే మార్గాల్లో ఉన్న ప్రధాన కూడళ్ల వద్ద బిచ్చగాళ్లను అధికారులు తరలించిన విషయం తెలిసిందే. వారందర్నీ షెల్టర్‌కు తరలించారు. అదే తరహాలో ఇప్పుడు గుజరాత్‌లో మురికివాడలు కనిపించకుండా అడ్డుగోడ కట్టడం విమర్శలకు దారి తీస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+