వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ పాఠాలు అక్కర్లేదు, పాకిస్థాన్ కు బీజేపీ పవర్ ఫుల్ పంచ్, మీకు మాకు అదే తేడా !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మో డీ వ్యాఖ్యలపై స్పందించిన పాకిస్థాన్ కు బీజేపీ ఎమాత్రం ఆలస్యం చెయ్యకుండా అంతేస్థాయిలో పంచ్ విసిరింది. ప్రజాస్వామ్యం గురించి పాకిస్థాన్ తమకు పాఠాలు చెప్పకూడాదని, వినడానికే విడ్డూరంగా ఉందని బీజేపీ చురకలు అంటించింది.

గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో పాకిస్థాన్ జోక్యం ఉందనీ, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్‌ను సీఎం చేసేందుకు దాయాది దేశం పాకిస్థాన్ కుట్రపన్నుతుందని గుజరాత్ ఎన్నికల ప్రాచారం సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

Gujarat assembly elections:Don't need lessons from Pakistan, BJP

ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై పాకిస్థాన్ విదేశాంగమంత్రి మహమ్మద్ ఫైజల్ సోషల్ మీడియాలో స్పందిస్తూ భారత ఎన్నికల చర్చల్లోకి అనవసరంగా పాకిస్థాన్ ను లాగడం మానుకోవాలని సూచించారు. మీదేశంలో ఎన్నికలు జరిగితే మాదేశం ఎందుకు జోస్యం చేసుకుంటుందని మహమ్మద్ ఫైజల్ ప్రశ్నించారు.

కట్టుకథలు చెప్పడం కంటే మీ సొంత శక్తి మీద విజయాలు సాధిస్తే బాగుటుందని పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ షైజల్ ప్రధాని నరేంద్ర మోడీకి సూచిస్తూ ట్వీట్ చేశారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఫైజల్ కామెంట్లకు బీజేపీ ఎమాత్రం అలస్యం చెయ్యకుండా గట్టిగా ఎదురు సమాధానం ఇచ్చింది.

కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ భారత అంతర్గత వ్యవహారాల్లో వెలుపలి దేశం జోక్యం చేసుకోవడం వెనుక అంతులేని విద్వేషం దాగి ఉందని ఆరోపించారు. భారతదేశంలో పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఎలా ప్రోత్సహిస్తుందో ప్రపంచానికే తెలుసని రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు.

మా దేశ ప్రజాస్వామ్యంపై మేము చాలా గర్వపడుతున్నామని, ప్రజాస్వామ్యం విలువలపై పాకిస్తాన్ మాకు పాఠాలు చెప్పడం వింటుంటే విడ్డూరంగా ఉందని దాయాది పాకిస్థాన్ కు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు.

English summary
An indignant Bharatiya Janata Party on Monday lashed out at Pakistan for its comment on Prime Minister Narendra Modi, asking it to stop giving India lessons on the state assembly elections going on in Gujarat. We completely abhor any outside interference in India’s electoral affairs, stated Union Law Minister Ravi Shankar Prasad, addressing the media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X