గుజరాత్ పోల్:సిట్టింగులకే పెద్ద పీట, 21 మందికి కాంగ్రెస్ టికెట్, 4 ముస్లిం అభ్యర్థులు
గుజరాత్ అసెంబ్లీకి కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 46 మందితో జాబితా రిలీజ్ చేయగా అందులో 21 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. నలుగురు ముస్లింలకు కూడా టికెట్ కేటాయించింది. ఫస్ట్ ఫేజ్ కోసం 68 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 21 స్థానాలు.. మోర్బి, తలలా, భావ్ నగర్ రూరల్, ధారీ, కొడినార్, రాపార్, భారుచ్, రాజ్ కోట్ ఈస్ట్, రాజ్ కోట్ వెస్ట్, జాంబుసర్, నవసరీ, జామ్ నగర్ రూరల్ క్యాండెట్స్ కేటాయించాల్సి ఉంది.

21 మంది సిట్టింగులే..
46 స్థానాల్లో 21 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో మాజీ లీడర్ ఆఫ్ అపోజిషన్, అమ్రెలి ఎమ్మెల్యే పరేశ్ ధాననీ, కాంగ్రెస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, తాంకారా ఎమ్మెల్యే లలిత్ కగతారా, ఉనాసెట్ నుంచి సీనియర్ ఎమ్మెల్యే పంజా వంశ్ ఉన్నారు. దాసడ, చిటొలా, ధోరజి, కలవాడ్ (ఎస్సీ), ఖాంబలియా, జామ్జొద్ పూర్, జూనాఘడ్, మంగ్రొల్, సోమ్ నాథ్, లాథీ, సర్వకుండ్ల, రాజులా, తాలాజా, మాండ్వీ (ఎస్టీ), వ్యారా (ఎస్టీ), నిజర్ (ఎస్టీ), వాండ్సా (ఎస్టీ) నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేటాయించారు.

21 స్థానాలకు అభ్యర్థులు..
తొలి విడత జరిగే పోల్‌కు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు కేటాయించింది. మరో 21 స్థానాలకు మాత్రం అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వాంకెనర్ నుంచి మహ్మద్ జావేద్ పిజాదా, అబ్ సదా నుంచి మహ్మద్ బాయ్ జంగ్ జాట్, వాగ్రా నుంచి సులేమాన్ పటేల్, సూరత్ ఈస్ట్ నుంచి అసలమ్ సైకిల్ వాలాకు సీటు కేటాయించారు.

77 నుంచి 59కి పడిపోయిన సంఖ్య
2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 77 సీట్లను గెలుచుకుంది. కానీ కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో ఆ సంఖ్య 59గా ఉంది. గుజరాత్ అసెంబ్లీ నియోజకవర్గంలో 182 స్థానాలు ఉన్నాయి. రెండు విడతలుగా ఎన్నిక జరగనుంది. డిసెంబర్ 1వ తేదీన 89 నియోజకవర్గాలకు 5వ తేదీన 93 నియోజకవర్గాలకు ఎన్నిక జరగనుంది. డిసెబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఈ ఎన్నికలో ఆరో సారి గెలిచి.. అధికారం చేపడుతామని బీజేపీ ధీమాతో ఉంది.












Click it and Unblock the Notifications