బ్రెజిల్ అమ్మాయితో గుజరాత్ అబ్బాయి "లవ్ స్టోరీ".. ఇన్ స్టాలో వైరల్ !

విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు ఎదలో దాచగలమా అంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. 2020... ప్రపంచం కరోనా మహమ్మారి భయంతో మూసుకుపోయిన రోజులు. రహదారులు వెలవెలబోయాయి, ప్రజల్లో భయం నిండిపోయింది. కానీ ప్రేమకు దేశాలు, సంస్కృతులు, భాషలు, సరిహద్దులు అడ్డుకావని మరోసారి నిరూపించింది ఓ జంట. ఒకవైపు బ్రెజిల్‌లోని టైనా షా, మరోవైపు భారత్‌లోని గుజరాత్ యువకుడు... వీరిద్దరి కథ మొదట ఆన్‌లైన్‌ పరిచయంతో మొదలై.. చివరికి పెళ్లి బంధంతో రెండు ఖండాల మధ్య వారధి కట్టింది. ఈ రియల్‌స్టోరీ ఇప్పుడంతా సినిమా కథలా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లో వణికిపోతున్న వేళ.. ఆన్‌లైన్‌ లో పరిచయం అయిన బ్రెజిల్‌ అమ్మాయి కోసం.. గుజరాత్ యువకుడు ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాడు. తన ప్రేమ నిజమని నిరూపించుకోవడానికి, ప్రాణాల మీదకు తెచ్చుకుని బ్రెజిల్ వరకు ప్రయాణించాడు. వైరస్ భయం, అరుదైన విమాన టికెట్లు, ప్రయాణంలో ఉన్న అడ్డంకులు అన్నీ అతన్ని ఆపలేకపోయాయి. "ప్రాణాలకు ముప్పు ఉన్నా, నేను వస్తాను" అన్న ఆ ఒక్క మాటే వారి ప్రేమ ఎంత గొప్పదో నిరూపించింది. ఆ క్షణం నుంచి వారి బంధం మరింత బలపడింది.

gujarat-boy-love-story-with-brazilian-girl-goes-viral-on-instagram

ఐదు నెలల్లో పెళ్లి పీటలు..

ఆ కలయిక తర్వాత ఈ జంట విడిపోలేకపోయింది. కేవలం ఐదు నెలలలోనే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి కేవలం వేడుకగా కాకుండా రెండు సంస్కృతుల కలయికగా మారింది. బ్రెజిల్‌లో జరిగిన ఆ వివాహానికి భారత యువకుడి కుటుంబం మొదటి నుంచి సంపూర్ణ మద్దతు ఇచ్చింది. అమ్మాయి తరపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ జంట ఒక్కటయ్యారు.

టైనా ఎమోషనల్ పోస్ట్..

ఈ మేరకు తమ జీవితయాత్రను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న టైనా ఇలా రాసుకొచ్చింది. "మేము వేర్వేరు సంస్కృతుల నుంచి వచ్చినా మా విలువలు ఒక్కటే. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, గౌరవం రోజురోజుకు పెరుగుతోంది. మా ఆత్మలను కలిపిన ఈ విశ్వానికి కృతజ్ఞతలు. రాసిపెట్టి ఉన్న ప్రేమకు ఎక్కువ సమయం పట్టదు. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయింది. వేలాది లైకులు, వందలాది కామెంట్లు వెల్లువెత్తాయి. ప్రేమ ఎక్కడున్నా ప్రేమే, దేశాల మధ్య సరిహద్దులు అడ్డుకావు" అంటూ ఒకరు స్పందించగా, "అద్భుతమైన జంట.. దేవుడు మీపై తన దీవెనలు కురిపించాలని కోరుకుంటున్నాం" అని మరొకరు వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+