గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి హవా: కాంగ్రెసు వెనకంజ
అహ్మదాబాద్: గుజరాత్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) హవా కొనసాగింది. సోమవారం ఓట్ల లెక్కింపు జరిగింది. బిజెపి 44 మున్సిపాలిటీల్లో గెలిచింది.
కాగా, కాంగ్రెసు పార్టీ 13 మున్సిపల్ కార్పోరేషన్లలో గెలిచింది. శనివారంనాడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ జరిగింది. గుజరాత్‌లోని 28 జిల్లాల్లో జరిగిన పోలింగులో 64.4 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రస్తుతం బిజెపి రాష్ట్రంలోని 75 మున్సిపాలిటీల్లో 59 సంస్థల్లో అధికారంలో ఉంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు బిజెపికే కాకుండా కాంగ్రెసుకు కూడా కీలకమైనవే. 2017లో జరిగిన శాసనసభ ఎన్నికల తర్వాత ఈ ఎన్నికలు జరిగాయి.












Click it and Unblock the Notifications