Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్వతంత్ర్య అభ్యర్థిగా జిగ్నేశ్.. కాంగ్రెస్, ఆప్ మద్దతు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దళిత హక్కుల కార్యకర్త జిగ్నేశ్ మేవానీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.

న్యూఢిల్లీ: గుజరాత్‌లో దళిత హక్కుల కార్యకర్త జిగ్నేశ్ మేవానీ స్వతంత్ర అభ్యర్థిగా తన అద్రుష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయన పోటీ చేసేందుకు వీలుగా వాడ్గాం స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం లేదు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 76 మంది అభ్యర్థులతో ప్రకటించిన మూడో జాబితాలో బనస్కాంత జిల్లా వాద్గాం ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి అభ్యర్థిని చేర్చలేదు.

ఆయన తన అభ్యర్థిత్వాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. స్థానిక సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మణిభాయి వాఘేలాను ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని జీపీసీసీ నాయకత్వం సూచించింది. మణిభాయి వాఘేలా కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

పోటీకి దూరమని మణిభాయి వాఘేలా ఇలా

పోటీకి దూరమని మణిభాయి వాఘేలా ఇలా

‘నన్ను ఎన్నికల్లో పోటీ చేయొద్దని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. మేవానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుంది' అని మణిభాయి వాఘేలా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హై కమాండ్‌తో కుదిరిన ఒప్పందం మేరకు జిగ్నేశ్ మేవానీ ఈ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. మేవానీ స్థానం నుంచి జిగ్నేశ్ మేవానీకి కాంగ్రెస్ పార్టీ పరోక్ష మద్దతు ఇస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మేవానీ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించలేదు. ఇందులో ఇప్పటికే హార్దిక్‌ పటేల్‌, అల్పేశ్‌ ప్రతిపక్ష కాంగ్రెస్‌కు మద్దతివ్వగా జిగ్నేశ్‌ మేవాని మాత్రం తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు కాంగ్రెస్‌ వెలుపలి నుంచి మద్దతు ఇచ్చిందని తెలిపారు.

 ఎన్నికల తర్వాత పోరాడతామన్న మణిభాయి వాఘేలా

ఎన్నికల తర్వాత పోరాడతామన్న మణిభాయి వాఘేలా

‘అధికార బీజేపీ మాకు కీలక ప్రత్యర్థి పక్షం. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయొద్దని కోరుతున్నా. మేం బీజేపీకి ముఖాముఖీ పోటీ చేయాలని సంకల్పించాం. బీజేపీ నియంత్రుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా పోరాడాలని కోరుతున్నాం. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత కూడా ఈ పోరాటం సాగుతుంది' అని మణిభాయి వాఘేలా ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.కాగా, ఇటీవల కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో మేవానీ సమావేశమయ్యారు. తమ డిమాండ్లను కాంగ్రెస్‌ అంగీకరించిందని.. అయితే తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని కూడా తెలిపారు.

 జిగ్నేశ్ తదితరులతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అవగాహన

జిగ్నేశ్ తదితరులతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అవగాహన

గతేడాది ఆగస్టులో ఉనాలో దళితులపై గో రక్షకుల దాడికి వ్యతిరేకంగా జరిగిన ప్రచారోద్యమం, ఆందోళనలో ముందు పీఠిన నిలిచిన జిగ్నేశ్ మేవానీ.. ఏ ఒక్కరూ పోటీ చేయకుంటే బీజేపీ అభ్యర్థి విజయ్ చక్రవర్తితో ముఖాముఖీ పోటీ పడతారు. జిగ్నేశ్ మేవానీకి తోడు ఛోటుబాయి వాసవ సారథ్యంలో భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ), పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కన్వీనర్ హార్దిక్ పటేల్ అనుచరులకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు కేటాయించింది. ఛోటు వాసవ సారథ్యంలోని బీటీపీకి ఐదు స్థానాలు కేటాయించింది, కానీ పాస్ ఏయే స్థానాల్లో పోటీ చేయనున్నదో ఇంకా తెలియలేదు.

 ఫోన్ల ద్వారా నామినేషన్లు దాఖలు చేయాలని కాంగ్రెస్ పార్టీ సూచనలు

ఫోన్ల ద్వారా నామినేషన్లు దాఖలు చేయాలని కాంగ్రెస్ పార్టీ సూచనలు

ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ రెండు దశల్లో 86 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. కానీ మూడో దఫా అభ్యర్థుల జాబితా వెల్లడిపై ఆచితూచి స్పందించింది. మూడో జాబితా అభ్యర్థులకు నేరుగా ఫోన్లు చేసి నామినేషన్లు దాఖలు చేయాలని సూచించింది. తొలి జాబితా వెలువడగానే సూరత్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై అసమ్మతి నేతలు దాడి చేశారు. మరోవైపు కాంగ్రెస్ తిరుగుబాటు నేతలకు నచ్చజెప్పేందుకు పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, బీకే హరిప్రసాద్, ముకుల్ వాస్నిక్ తదితర నేతలు గుజరాత్ రాష్ట్రానికి చేరుకుని నేతలతో సంప్రదింపులు జరిపారు.

 జిగ్నేశ్‌కు మద్దతుగా కేజ్రీవాల్ ఇలా ట్వీట్

జిగ్నేశ్‌కు మద్దతుగా కేజ్రీవాల్ ఇలా ట్వీట్

బనస్కాంత జిల్లా వాద్గాం ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన జిగ్నేశ్ మేవానీకి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) మద్దతు ప్రకటించింది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ జిగ్నేశ్ మేవానీకి తన అభినందనలు తెలిపారు. ‘జిగ్నేశ్ మేవానీకి అభినందనలు' అని అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. వాద్గాం ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి పోటీ చేస్తున్న తనకు మద్దతు ఇవ్వాలని జిగ్నేశ్ మేవానీ వివిధ పార్టీల నేతలు కోరారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 30 స్థానాల్లో పోటీ చేస్తున్నది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+