Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విజయ్ రూపానీ రాజీనామా వెనుక- అమిత్ షా అందుకే వచ్చి వెళ్లారా : వరుసగా నాలుగో సీఎంగా..!!

ప్రధాని మోదీ -కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం..బీజేపీకి కంచుకోట లాంటి గుజరాత్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ రూపానీ ఆకస్మికంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు. ఎటువంటి చర్చ లేకుండా..బీజేపీ గుజరాత్ లో సీఎం మార్పు ఆపరేషన్ చేపట్టింది. అందులో తొలి అడుగు పూర్తి చేసింది. కొద్ది సేపటి క్రితం సీఎం విజయ్ రూపానీ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు తన రాజీనామా లేఖ అందించారు.

ఆకస్మికంగా గుజరాత్ సీఎం రాజీనామా

ఆకస్మికంగా గుజరాత్ సీఎం రాజీనామా

మరో ఏడాదిలో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో కొత్త సీఎంను నియమించి ఆయన నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. వయసు రీత్య-అనారోగ్య సమస్యలు- అయిదేళ్ల పాలన పూర్తి కావటంతో విజయ్ రూపానీని తప్పించినట్లుగా చెబుతున్నారు. తనకు అవకాశం ఇచ్చిన ప్రధాని..హోం మంత్రి.. బీజేపీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కేటాయించిన బాధ్యతల్లో కొనసాగుతానని రూపానీ స్పష్టం చేసారు. తదుపరి సీఎం ఎవరనేది ఇంకా బీజేపీ అధికారికంగా ప్రకటించలేదు.

వరుసగా నాలుగో సీఎంగా రూపానీ

వరుసగా నాలుగో సీఎంగా రూపానీ

పటేల్ వర్గానికే సీఎం పదవి దక్కే అవకాశం ఉందని గుజరాత్ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచార సాగుతోంది. గత కొద్ది కాలంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వరుసగా సీఎంలను మారుస్తోంది. రూపానీ ఆ లిస్టులో నాలుగో వ్యక్తిగా ఉన్నారు.భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు వరుసగా రాజీనామా చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు త్రివేంద్ర సింగ్ రావత్, తీరత్ సింగ్ రాజీనామా చేశారు, అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజీనామా చేశారు.

వ్యతిరేకత-అనారోగ్యం..కొత్త నేతకు పగ్గాలు

వ్యతిరేకత-అనారోగ్యం..కొత్త నేతకు పగ్గాలు

కాగా తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఇప్పుడు రాజీనామా చేశారు. ఇప్పుడు గుజరాత్ నూతన ముఖ్యమంత్రి రేసులో నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నితిన్ పటేల్, సీఆర్ పటేల్, మన్షుక్ మాండవీయా, జోర్డాన్ జడాఫియా రేసులో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. 2017 లో ఎన్నికల కు ఏడాది ముందు అప్పటి సీఎం ఆనందిబెన్ ను మార్చి విజయ్ రూపానీ ని నియమించారు. అయితే, కోవిడ్ నిర్వహణలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన మార్పుకు ఇది మరో కారణంగా చెబుతున్నారు.

కీలక నేత గుజరాత్ లోనే మకాం వేసి

కీలక నేత గుజరాత్ లోనే మకాం వేసి

ప్రధాని మోదీ గుజరా్ అహ్మదాబాద్ లో సర్దార్ ఢాం భవన్ ను వర్చువల్ విధానం లో ప్రారంభించారు. అదే విధంగా సర్దారం ఫేస్ 2 బాలికల హాస్టల్ కు భూజి పూజలో ప్రధాని వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఆ కార్యక్రమం పూర్తయిన వెంటనే సీఎం విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేసారు. అయితే, రూపానీ రాజీనామాకు ముందు గుజరాత్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ గుజరాత్ లో క్యాంపు వేయటం వెనుక సీఎం మార్పు అంశం ఉందని సమాచారం.

అమిత్ షా పర్యటన అందుకోసమేనా

అమిత్ షా పర్యటన అందుకోసమేనా

ఎంపీ, గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ వరుసగా సంతోష్ తో సమావేశాలు నిర్వహించటం కూడా సీఎం మార్పు కోసమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం అహ్మదాబాద్ వ్యక్తిగత పర్యటన కోసం వచ్చారని ఒక ప్రముఖ న్యూస్ ఎజెన్సీ వెల్లడించింది. తిరిగి శుక్రవారం ఆయన ఢిల్లీకి వెళ్లారు. గుజరాత్ లో సీఎం మార్పు పైన కీలక దిశా నిర్దేశం చేయటానికే అమిత్ షా అహ్మదాబాద్ వచ్చారా అనే చర్చ మొదలైంది.

Recommended Video

    Prabhas పై పెరుగుతున్న అక్కసు.. అప్పుడు రజినీ ఇప్పుడు డార్లింగ్ | Pan India | Oneindia Telugu
    కొత్త సీఎంతోనే ఎన్నికలకు వెళ్లేందుకు నిర్ణయం

    కొత్త సీఎంతోనే ఎన్నికలకు వెళ్లేందుకు నిర్ణయం

    అయితే, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వరుసగా ఇలా ముఖ్యమంత్రులను మార్చటం..ఎన్నికల ముందు కొత్త వారికి అవకాశం ఇవ్వటం కొద్ది కాలంగా పరిపాటిగా మారుతోంది. అయితే, ఆనందిబెన్ పటేల్ సీఎంగా ఉన్న సమయంలో పటేల్ ఉద్యమం కారణంగా ఆమెను తప్పించారని అప్పట్లో ప్రచారం సాగింది. ఇక, ఇప్పుడు రూపానీ స్థానంలో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. అయితే, మొత్తం రూట్ మ్యాప్ సిద్దం చేసుకున్న తరువాతనే.. వచ్చే ఎన్నికల్లో ఏ విధంగానూ ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా..కొత్త ముఖ్యమంత్రి ద్వారా ఎన్నికలకు సిద్దం అయ్యేందుకు యాక్షన్ ప్లాన్ సైతం కమలం పార్టీ సిద్దం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+