Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రతి బూత్‌లోనూ బీజేపీనే గెలుపు, రికార్డులు బద్దలు కొట్టాలంటూ ప్రధాని మోడీ పిలుపు

గాంధీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించాలన్న తన కలను సాకారం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లోని వెరావల్‌లో ఓటర్లను కోరారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి జరిగిన బహిరంగ ర్యాలీలో పాల్గొన్నారు ప్రధాని మోడీ. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. "ఈసారి ప్రతి పోలింగ్ బూత్‌లో బీజేపీని గెలిపించండి" అని ప్రజలకు పిలుపునిచ్చారు.

"భూపేంద్ర కోసం రికార్డులు బద్దలు కొట్టడానికి నరేంద్ర పని చేస్తున్నారు" అని ఆయన అన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో రికార్డులను బద్దలు కొట్టాలని ఆయన ఓటర్లను కోరారు. "నేను బీజేపీకి మాత్రమే ఓటు వేయమని చెప్పడం లేదు, కానీ ప్రతి బూత్‌లో రికార్డు సంఖ్యలో ఓటు వేయండి" అని ప్రధాని మోడీ కోరారు.

Gujarat Polls: ensure bjps victory in every booth, Says PM Modi At BJP Rally In Veraval.

'ఈ ఎన్నికల్లో, ఓటింగ్ రోజున ప్రజలు తమ తమ పోలింగ్ బూత్‌ల వద్దకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని, ఓటింగ్ శాతంలో గతంలో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టాలని నేను కోరుకుంటున్నాను. మీరు బీజేపీకి మాత్రమే ఓటు వేయాలని నేను చెప్పడం లేదు. ప్రతి ఒక్కరు నిర్ధారించుకోండి. ఈ ప్రజాస్వామ్య పండుగలో ప్రతి పౌరుడు పాల్గొంటారు. ఇది అందరికీ నా విజ్ఞప్తి' అని ర్యాలీలో పాల్గొన్న ప్రజలను, బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మోడీ వ్యాఖ్యానించారు.

'మీ నుంచి నేను కోరుకునే మరో విషయం ఏమిటంటే, ఇక్కడ ఉన్న ప్రతి బూత్‌లో బీజేపీ గెలవాలని. మీరు నాకు మాటిస్తారా? ఈసారి, నా దృష్టి ఇక్కడ ఉన్న అన్ని పోలింగ్ బూత్‌లను గెలుచుకోవడం. దీన్ని సాధించడంలో మీరు నాకు సహాయం చేస్తే, ఈ నలుగురు బీజేపీ అభ్యర్థులు గాంధీనగర్‌లోని అసెంబ్లీకి ఆటోమేటిక్‌గా చేరుకుంటారు' అని ప్రధాని చెప్పారు.

అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలో ఓడరేవులను అభివృద్ధి చేసి, పర్యాటకాన్ని పెంచిందని మోడీ హైలైట్ చేశారు. అధికార పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. రైతుల కోసం కొత్త విధానాలను కూడా ఆయన హామీ ఇచ్చారు.

కాగా, ఆదివారం ఉదయం అక్కడి ప్రముఖ పుణ్యక్షేత్రం సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. సోమనాథ్ ఆలయాన్ని సందర్శించడం ద్వారా ప్రధాని మోడీ తన రోజును ప్రారంభించిన మోడీ.. వెరావల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఆ తర్వాత ధోరాజీ, అమ్రేలి, బోటాడ్‌లను సందర్శించాల్సి ఉంది.

182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ రాష్ట్రంలో రెండు విడుతల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 1న 89 స్థానాలకు, డిసెంబర్ 5న తేదీన 93 చోట్ల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+