నల్లగా ఉన్నాడని భర్తను చంపేసిన భార్య, శారీరక సంబంధానికి నిరాకరణ
ఆనంద్: భర్త నల్లడా ఉన్నాడని అసంతృప్తితో ఉన్న 22 ఏళ్ల ఓ మహిళ అతడిని చంపేంది. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా, సుందరాణా గ్రామంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఆనంద్ జిల్లాలోని పెట్లాడ్ తాలుకాలో సుందరాణా గ్రామానికి చెందిన ఫర్జానాబానో(22) మహిళ తన భర్తను పెళ్లయినప్పటి నుంచే నల్లడా ఉన్నాడని అసహ్యించుకోవండతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భర్తతో శారీరక సంబంధానికి సైతం ఆమె నిరాకరించేది.

తన భర్తతో కాపురం చేయడం ఇష్టం లేక ఎక్కువగా పుట్టింటికి వెళుతూ ఉండేది, కొన్నాళ్లు ఆమె పుట్టింట్లో ఉండి ఇటీవలే తిరిగి వచ్చింది. బుధవారం రాత్రి వారిద్దరి మధ్య గొడవ జరగడంతో ఫరూఖ్ ఆమెను చెంపదెబ్బ కొట్టాడు.
గురువారం ఇద్దరు పొలానికి వెళ్లగా, ఆమె అక్కడే తన భర్తను వెనక నుంచి సుత్తితో కొట్టి చంపేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటాన స్ధలానికి చేరుకుని ఫర్జానాబానోను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications