తుపాకుల మోత: డిప్యూటీ సీఎం స్వాగతంలో బుల్లెట్ల వర్షం!
బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి శాంతిభద్రతల విషయంలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్డీఏ నాయకులు చట్ట పాలన స్థాపిస్తామని చెబుతుంటే.. ఆర్జేడీ ప్రతిరోజూ క్రైమ్ బులిటెన్ ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదలైన ఒక వీడియో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా లఖిసరాయ్ పర్యటన సందర్భంగా ఆయన మద్దతుదారులు బహిరంగంగా జరిపిన కాల్పుల వీడియో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టించింది.ఇందులో మద్దతుదారులు బహిరంగంగా ఆయుధాలు ఊపుతూ, గాలిలో కాల్పులు జరుపుతూ కనిపించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ్ సిన్హా బదహియాలో ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది.
హర్ష్ ఫైరింగ్ (ఉత్సవాల సందర్భంగా జరిపే కాల్పులు) చట్టవిరుద్ధం అయినప్పటికీ.. స్వయంగా డిప్యూటీ సీఎం సమక్షంలో జరిగిన ఈ ఘటనపై ఆర్జేడీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ సంఘటన శాంతిభద్రతల నిర్వహణపై ప్రశ్నలు రేకెత్తుతోంది. ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటన ప్రభుత్వం మాటలు, చేతలకు మధ్య ఉన్న తేడాను ఎత్తిచూపుతోంది.

రోడ్‌షోలో బుల్లెట్ల వర్షం
ఎన్నికల్లో విజయం సాధించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడానికి విజయ్ సిన్హా లఖిసరాయ్‌లోని బదహియాకు చేరుకుని రోడ్ షో నిర్వహించారు. వైరల్ అవుతున్న వీడియో ఫుటేజ్‌లో ఉప ముఖ్యమంత్రి తన వాహనం పైన నిలబడి ప్రసంగిస్తుండగా.. అతని మద్దతుదారులు దానికి చుట్టూ నిలబడి గాలిలోకి తుపాకులు ఊపుతూ, నిరంతరంగా కాల్పులు జరిపారు. మద్దతుదారులు బుల్డోజర్‌లను ఉపయోగించి పూల వర్షం కురిపించారు. అయితే, ఆయుధాల ప్రదర్శన, కాల్పులతో ఈ స్వాగతం భయాందోళనకర వాతావరణాన్ని సృష్టించింది.డిప్యూటీ సీఎం వంటి ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి సమక్షంలో బహిరంగంగా చట్టాన్ని ఉల్లంఘించడం, ఆ సమయంలో పోలీసులు మౌనంగా ఉండటం బీహార్‌లో శాంతిభద్రతలపై తీవ్ర ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.
चलाओ गोली! दिखाओ दोनाली! हड़काओ पब्लिक को खाली!
— Rashtriya Janata Dal (@RJDforIndia) November 28, 2025
सु"भाषण" की सरकार आई है! बड़बोले दुःशासन की सरकार आई है!
अब 5 साल तक 25-30 साल पहले की मनगढ़ंत बातों पर प्रवचन सुनते रहिए!
क्योंकि इससे अधिक इस सरकार के बस का कुछ नहीं है!#TejashwiYadav #RJD #Bihar pic.twitter.com/mio9k5zXbZ
ఆర్జేడీ ఘాటు కౌంటర్
ప్రతిపక్షంలో ఉన్న ఆర్జేడీ ఈ వీడియోను ఆయుధంగా వాడుకుంది. అధికారిక 'ఎక్స్' ఖాతాలో ప్రభుత్వంపై అత్యంత ఘాటైన విమర్శ చేసింది. "కాల్పులు జరపండి! దోనాలి (రెండు నాళాల తుపాకీ) చూపించండి! ప్రజలను భయపెట్టండి! ఇది సుపరిపాలన ప్రభుత్వం కాదు, బడబోలే దుశ్శాసన్ ప్రభుత్వం వచ్చింది. ఇక ఐదేళ్లు పాత కట్టుకథలపై ప్రసంగాలు వినడం తప్ప ఈ ప్రభుత్వం ఇంకేమీ చేయలేదు." అని ఆర్జేడీ ఘాటు కౌంటర్ ఇచ్చింది.
जन नमन अभिनंदन!
— Vijay Kumar Sinha (@VijayKrSinhaBih) November 28, 2025
लखीसराय के अपने परिवारजनों के बीच पहुँचकर उनके अपार समर्थन, आत्मीय स्नेह और अखंड विश्वास को देखकर अभिभूत हूं। जन-परिजनों का यह प्रेम और अपनापन मेरी सबसे बड़ी पूंजी है । इनसे मिलने वाला दुर्लभ स्नेह और सम्मान ही मुझे जन अपेक्षाओं पर खरा उतरने और क्षेत्र को समग्र… pic.twitter.com/Sfw97OLPf8
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications