మళ్లీ ఆర్టికల్ 370: కాశ్మీర్‌లో కొత్త కూటమి - అబ్దుల్లా-ముఫ్తీ- కాంగ్రెస్ ఉమ్మడి పోరు - రోడ్ మ్యాప్
ఏడాది కిందట రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన జమ్మూకాశ్మీర్, లదాక్ లో మళ్లీ ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలనే డిమాండ్‌తో అక్కడి ప్రధాన రాజకీయ పార్టీు ఉమ్మడి పోరాటానికి సిద్ధమయ్యాయి. జమ్మూకాశ్మీన్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని తిరిగి అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కొత్త కూటమి పురుడు పోసుకున్నది. ఈ మేరకు నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీడీపీ, కాంగ్రెస్ సహా మరో నాలుగు పార్టీలు చేతులు కలిపాయి.

రహస్య సమావేశం..
శ్రీనగర్ లోని ఓ రహస్య ప్రదేశంలో గురువారం సమావేశమైన ఏడు పార్టీలు.. కొత్త సంకీర్ణాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు తీర్మానం ఆమోదించాయి. జమ్మూకాశ్మీర్ లోఆర్టికల్ 370 ని ఉపసంహరించుకోవాలంటూ కేంద్రానికి పంపిన నోట్‌పై ఆయా పార్టీల ప్రతినిధులు సంతకం చేశారు. సమావేశం అనంతరం ఆ ఏడు పార్టీల నేతలు మీడియా ముందుకు వచ్చారు. కూటమి వివరాలు, భవిష్యత్ కార్యాచరణను ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు.

గుప్కర్ డిక్లరేషన్..
జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుకు ఒక్కరోజు ముందు, అంటే, 2019, ఆగస్టు 4న.. శ్రీనగర్ సిటీ గుప్కర్ రోడ్డులోని ఎన్సీ నేత ఫరూక్ అబ్బుల్లా ఇంట్లో అఖిల పక్ష సమావేశం నిర్వహించి ‘‘గుప్కర్ డిక్లరేషన్'' తీర్మానాన్ని ఆమోదించడం తెలిసిందే. మళ్లీ ఏడాది తర్వాత మొన్న ఆగస్టులో ఆ ఏడు పార్టీలు సమావేశమై గుప్కర్ డిక్లరేషన్ ను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాయి. 14 నెలల గృహ నిర్బంధం తరువాత పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ మంగళవారం(అక్టోబర్ 13న) విడుదల కావడంతో ఆర్టికల్ 370 పునరుద్దరణ పోరు ముమ్మరం అయింది. ముఫ్తీ విడుదలైన కొద్ది రోజలకే కొత్త కూటమి ఏర్పడటం గమనార్హం..

పేరు.. పీపుల్స్ అలయెన్స్..
ఆర్టికల్ 370 పునరుద్ధరణే లక్ష్యంగా తీర్మానం చేసిన ‘గుప్కర్ డిక్లరేషన్'లో భాగంగా అన్ని పార్టీలు కలిసి రాజకీయ, సామాజిక పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. తమ కూటమికి ‘‘పీపుల్స్ అలయెన్స్ ఆఫ్ గుప్కర్ డిక్లరేషన్'' గా నామకరణం చేసినట్లు తెలిపారు. రాష్ట్రం కోల్పోయిన హక్కులు సాధించేందుకు రాజ్యాంగ పరమైన పోరాటం చేసేందుకు ఈ కూటమి ఏర్పడిందని, 2019 ఆగస్టు 5 కు ముందునాటి పరిస్థితులు తీసుకువచ్చేందుకు కృషిచేస్తామని ఆయన పేర్కొన్నారు.

కూటమిగానే ఎన్నికల్లో పోటీ..
జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 ని పునరుద్ధరించాలంటూ ‘పీపుల్స్ అలయెన్స్' పేరిట ఏకమైన వాటిలో.. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్, సీపీఎం, జమ్ముకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ, పాంథర్స్ పార్టీ, జమ్ముకశ్మీర్ అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఉన్నాయి. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో అక్కడ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం గతంలోనే ప్రకటించింది. కాగా, ఎప్పుడు ఎన్నికలు ప్రకటించినా పార్టీలననీ పీపుల్స్ అలయెన్స్ కూటమిగానే పోటీ చేస్తాయపి అబ్దుల్లా స్పష్టం చేశారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications