నేడే గురు పౌర్ణమి: శుభ ఘడియలు, పూజా విధానం ఇదే
ఇవ్వాళ గురు పౌర్ణమి. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వేద వ్యాసుడు గురు పౌర్ణమి నాడే జన్మించారని నమ్ముతారు. అందుకే ఈ రోజును వ్యాస పూర్ణిమగా కూడా పిలుస్తారు. సమస్త మానవాళికి వేదాలను బోధించడం అనేది ఆయనతోనే ఆరంభమైనందు వల్ల ఆది గురువుగా పూజిస్తారు వ్యాస మహర్షిని.
గురువు ఆశీస్సులు మెండుగా ఉండాలనే సద్భావనతో ఇవ్వాళ గురుబ్రహ్మలను పూజిస్తారు. దీనివల్ల ఐశ్వర్యం, సుఖ శాంతులు లభిస్తాయని విశ్వసిస్తారు. వేదాల్లో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. హిందు సంప్రదాయాల ప్రకారం.. గురువు భగవంతుని కంటే కూడా ఉన్నతుడిగా పూజలందుకుంటాడు. వేద వ్యాసుడు బోధిస్తోండగా.. సాక్షాత్ వినాయకుడు మహా భారతాన్ని రాశాడని ప్రతీతి.

గురు పూర్ణిమ తిథి ఇప్పటికే ఆరంభమైంది. ఆదివారం రాత్రి 8:21 నిమిషాలకు మొదలైంది. ఈ సాయంత్రం 5:08 నిమిషాలకు ముగుస్తుంది. ఎన్నో శుభ యోగాలు ఇవ్వాళ సంభవించనున్నాయి. బ్రహ్మయోగం, ఇంద్రయోగం ఏర్పడనున్నాయి. బుధాదిత్య యోగం సైతం ఇవ్వాళే ఏర్పడబోతోంది. సోమవారం సాయంత్రం 7:26 నిమిషాల నుంచి ఈ మధ్యాహ్నం 3:45 నిమిషాల వరకు బ్రహ్మ యోగం ఉంటుంది.
దీని తరువాత ఇంద్ర యోగం ఆరంభమౌతుంది. ఈ మధ్యాహ్నం 3:45 నిమిషాలకు ప్రారంభం అయ్యే ఇంద్రయోగం మంగళవారం ఉదయం 11:50 నిమిషాలకు పూర్తవుతుంది. గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరు తెల్లవారుజామునే నిద్ర లేవాలి. ఇంటిని శుభ్రం చేసిన అనంతరం ఆభ్యంతన స్నానం చేయాలి. తెల్లటి వస్త్రంపై వ్యాస పీఠాన్ని ప్రతిష్ఠించాలి.

దానిపై గురువు చిత్రపటాన్ని ఉంచి ప్రత్యేక పూజలు చేయాలి. నీరు, పండ్లు, పుష్పాలు, అక్షింతలు, ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి. పూజ అనంతరం ఉపవాసం ఉండటం మేలు. సూర్యోదయం తరువాతి సమయం నుంచి చంద్రుడు ఉదయించే వరకు ఆచరించాల్సి ఉంటుంది. గురు పూజ చేయడం వల్ల చదువుల్లో నెలకొన్న ఆటంకాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతుంటారు.

భారత్, నేపాల్, భూటాన్ వంటి దేశాలు గురుపౌర్ణమిని జరుపుకొంటాయి. బౌద్ధులకు ఈ పండుగ చాలా ప్రత్యేకమైనది. బుద్ధ భగవానుడిని ఆది గురువుగా పూజిస్తారు బౌద్ధులు. జైనులు మహా వీరుడికి ఇవ్వాళ ప్రత్యేక పూజలు చేస్తారు. గురు స్థానంలో ఉండే సాయిబాబా, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయుడికి భక్తులు భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications