Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫేస్‌బుక్ ఫ్రెండ్: యువతిని నమ్మించి అత్యాచారం, ఫోటోలతో బ్లాక్‌మెయిల్

భోపాల్: ఫేస్‌బుక్ పరిచయాలు కొంపలు ముంచుతాయని అనేక ఘటనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. కానీ, అపరిచితులతో స్నేహం చేసే విషయంలో జాగ్రత్త ఉండకపోవడంతో అనేక అనర్ధాలు చోటు చేసుకొంటున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఇదే తరహ ఘటన చోటు చేసుకొంది.ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ను నమ్మిన ఓ యువతి తన ఉద్యోగాన్ని పోగోట్టుకొంది. డబ్బులును కోల్పోయింది. ఆఖరికి పెళ్ళి కూడ చెడిపోయింది. ప్రెండ్‌గా నమ్మించిన నిందితుడు బాధితురాలిపై అత్యాచారానికి కూడ పాల్పడ్డాడు.

ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన యువతిని ఓ యువకుడు మోసం చేశారు. అన్ని రకాలుగా ఆ యువతిని ఇబ్బందులకు గురిచేశాడు. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి పోటోలను అసభ్యంగా చిత్రీకరించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

బాధితురాలు ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలియగానే నిందితుడు పారిపోయాడు.

ఫేస్‌బుక్‌తో ప్రేమాయణం

ఫేస్‌బుక్‌తో ప్రేమాయణం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ పట్టణానికి చెందిన రుషబ్ ఆర్టిఫిషియల్ జ్యూలయరీ పనిచేస్తుంటాడు. ఫేస్‌బుక్‌లో ఒక యువతితో పరిచయం పెంచుకున్నాడు.పరిచయాన్ని ప్రేమగా నమ్మించాడు. ఆమె తనతో స్నేహంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలను నిందితుడు ఉపయోగించి బ్లాక్‌మెయిల్ చేశాడు. డబ్బులు డిమాండ్ చేశాడు. ఫోటోలను ఎడిట్ చేసి అశ్లీలంగా రూపొందించాడు. ఈ ఫోటోలతో బాధితురాలిని లక్షల రూపాయాలు డిమాండ్ చేశాడు.

రూ.10 లక్షలు చెల్లించిన బాధితురాలు

రూ.10 లక్షలు చెల్లించిన బాధితురాలు

ఫేస్‌బుక్ ప్రెండ్‌షిప్ పేరుతో నిందితుడు బాధితురాలిని తీవ్రంగా ఇబ్బందులు పెట్టాడు. ఫోటోలను అశ్లీలంగా మార్చి డబ్బులు డిమాండ్ చేశారు. అయితే నిందితుడు డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితురాలు రూ. 10 లక్షల నగలు, నగదు తీసుకురమ్మని డిమాండ్ చేశాడు. ఈ మేరకు నిందితుడికి చెల్లించింది. అయినా నిందితుడిలో ఆశ చావలేదు.

పెళ్ళి దెబ్బతింది, ఉద్యోగం పోయింది

పెళ్ళి దెబ్బతింది, ఉద్యోగం పోయింది

తాను చేస్తున్న ఉద్యోగానికి కూడ బాధితురాలు రాజీనామా చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బాధితురాలికి వచ్చిన పెళ్ళి సంబంధం కూడ దెబ్బతింది. వరుడు కుటుంబసభ్యులు యువతితో వివాహన్ని రద్దు చేసుకొన్నారు.

 యువతిపై అత్యాచారం

యువతిపై అత్యాచారం

నిందితుడు తన ఇంటికి బాధితురాలిని పిలిచాడు. తాగు నీటిలో మత్తు మందు కలిపి అత్యాచారం చేశాడు.అన్ని రకాలుగా తాను మోసపోయాయని ఎట్టకేలకు గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+