జ్ఞాన్‌వాపి మసీదుపై హైకోర్టు సంచలన నిర్ణయం

Gyanvapi Mosque: చారిత్రాత్మకమైన వారణాశిలో గల జ్ఞాన్‌వాపి మసీదుపై అలహాబాద్ హైకోర్టు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మసీదుపై ముస్లిం సంఘాలు దాఖలు చేసిన పిటీషన్లన్నింటినీ కొట్టివేసింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే అలహాబాద్ హైకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఇందులో పురావస్తు శాఖ అధికారులు సర్వే నిర్వహించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయింది.

జ్ఞాన్‌వాపి మసీదులో శివాలయం ఉందంటూ హిందూ సంఘాలు ముందు నుంచీ చెబుతూ వస్తోన్నాయి. ఈ మేరకు కొందరు హిందూ సంఘాల ప్రతినిధులు మసీదులో పూజలు చేయడానికీ ప్రయత్నించారు గతంలో. జ్ఞాన్‌వాపి మసీదులో శివాలయం ఉండేదని, దాన్ని నేలమట్టం చేశారనేది హిందూ ధార్మిక సంఘాల వాదన.

Gyanvapi mosque: Allahabad HC turned down all petitions from the Muslim side

దీనికి సంబంధించిన పలు సాక్ష్యాధారాలను వారు అప్పట్లో న్యాయస్థానానికి సమర్పించారు. ఈ మసీదులో ప్రాచీన శివలింగం, నంది, కోనేరు కూడా ఉన్నాయని వారు వివరించారు. అక్కడ పూజలను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలనీ అభ్యర్థించారు. ఈ మేరకు వారు దాఖలు చేసిన పిటీషన్‌ను ఇదివరకు వారణాశి జిల్లా న్యాయస్థానం సింగిల్ బెంచ్ జడ్జి విచారణ చేపట్టింది.

దీనికి కౌంటర్‌గా అంజుమన్ ఇంతెజామియా మసీద్ మేనేజ్‌మెంట్ కమిటీ, సున్నీవక్ఫ్ బోర్డ్ 2021 ఏప్రిల్ 8వ తేదీన వేర్వేరుగా పిటీషన్ దాఖలు చేశాయి. హిందూ ధార్మిక సంఘాల తరఫున విష్ణు శంకర్ జైన్, అంజుమన్ కమిటీ తరఫున సీనియర్ అడ్వొకేట్ మిరాకుద్దీన్ సిద్ధిఖీ తమ వాదనలను వినిపించారు.

మసీదు కాంప్లెక్స్‌లో సంస్కృత శ్లోకాలు, పాత జ్యోతిర్లింగం, హిందూ కళాఖండాలు.. వంటివి ఉన్నాయని జైన్ వాదించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఆయన న్యాయస్థానానికి సమర్పించారు. అలాగే- ఉత్తరం వైపున కొన్ని ఆలయ స్తంభాల నిర్మాణం మధ్యలో ఆగిపోయినట్లు కూడా ఉందని పేర్కొన్నారు.

ఆ గుర్తులను దాచడానికి పదేపదే పెయింట్ చేశారని చెప్పారు. సాధారణంగా హిందూ ఆలయాల్లో ఉండే గుమ్మటాలు మసీదులో ఉన్నాయనీ అన్నారు. అంజుమన్ కమిటీ పిటీషన్‌పై విచారణ చేపట్టడానికి వారణాశి జిల్లా న్యాయస్థానం సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ అజయ్ కృష్ణ విశ్వేశర్ నిరాకరించారు. హిందూ ధార్మిక సంఘాల పిటీషన్‌‌ మెయింటెయిన్ చేయాలంటూ అప్పట్లో ఆదేశించారు.

Gyanvapi mosque: Allahabad HC turned down all petitions from the Muslim side

శివాలయం ఉందా? లేదా? అనేది నిర్ధారించడానికి ఆర్కియాలాజికల్ విభాగంతో సర్వే జరిపించాలంటూ ఆదేశించారు. దీన్ని అంజుమన్ కమిటీ వ్యతిరేకించింది. అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. మసీదులో శివాలయం ఉందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించేలా పురావస్తు శాఖ సర్వే నిలిపివేయాలంటూ అంజుమన్ కమిటీ పిటీషన్ దాఖలు వేసింది.

ఆయా పిటీషన్లన్నింటి పైనా అలహాబాద్ హైకోర్టు విచారణ జరిపింది. ఈ నెల 8వ తేదీన విచారణ ముగించింది. తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తన తీర్పును వెలువడించింది. అంజుమన్ కమిటీ, సున్నీ వక్ఫ్ బోర్డ్ దాఖలు చేసిన పిటీషన్లను కొట్టివేసింది. ప్రార్థనా స్థలాల చట్టం 1991 ఆధారంగా ఈ పిటీషన్లను తోసిపుచ్చినట్లు హైకోర్టు తెలిపింది.

హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటీషన్‌కు అనుగుణంగా ఇదివరకు వచ్చిన తీర్పులకు లోబడి అక్కడ మెయింటెనబిలిటీ కొనసాగుతుందని వివరించింది. మసీదులో ఆర్కియలాజికల్ సర్వే నిర్వహణ, ఆలయ పునర్నిర్మాణ పనులకు ఈ నిర్ణయం అంగీకారం తెలిపినట్టయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+