అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఇదీ భారత్: ట్రంప్ వద్దకు 'ఐటీ' లాబీ

ఇండియాకు చెందిన టాప్ ఐటీ పరిశ్రమకు చెందిన సీనియర్ మెంబర్స్ ఫిబ్రవరి 24వ తేదీ నుంచి వారం రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. హెచ్1బీ వీసాల రగడ నేపథ్యంలో వారు అమెరికా వెళ్లనున్నారు.

ముంబై: ఇండియాకు చెందిన టాప్ ఐటీ పరిశ్రమకు చెందిన సీనియర్ మెంబర్స్ ఫిబ్రవరి 24వ తేదీ నుంచి వారం రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. హెచ్1బీ వీసాల రగడ నేపథ్యంలో వారు అమెరికా వెళ్లనున్నారు.

ఈ ఐటీ సంస్థలు అన్నీ కలిసి లాబీగా ఏర్పడి అమెరికాను సందర్శిస్తాయి. అమెరికాలో హెచ్‌1బీ వీసాలపై నిబంధనలను కఠినతరం చేసే ప్రతిపాదన ఉండడంతో వీరు అమెరికా వెళ్లాలని నిశ్చయించుకున్నారు.

H-1B visa concerns: Members of India's top IT industry lobby to visit US

వీరు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ కార్యవర్గాన్ని కలుసుకొని ఇరుదేశాల మధ్య నైపుణ్యం ఉన్న మానవవనరుల రాకపోకలకు అవకాశాలపై చర్చిస్తారు.

భారతీయ ఐటీ రంగం అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగ సృష్టికి, ఉద్యోగ రక్షణకు చేస్తున్న కృషిని వివరిస్తామని నాస్‌కామ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శివేందర్‌ సింగ్‌ తెలిపారు.

భారతీయ ఐటీ పరిశ్రమ అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి ఎంతో మేధోసంపత్తిని తీసుకొస్తోందనే విషయం అక్కడి వారికి వివరిస్తామని నాస్‌కామ్‌ అధ్యక్షుడు ఆర్‌ చంద్రశేఖర్‌ చెప్పారు. కాగా, భారతీయ ఐటీ రంగం అమెరికా నుంచి 65శాతం ఆదాయాన్ని పొందుతోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+