Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొంప ముంచిన H1B Visa ఫీజు వ్యవహారం

H-1B వీసా ఫీజు పెంపు వ్యవహారం భారతీయుల కొంప ముంచుతోంది. అమెరికా వెళ్లాలనుకునే వాళ్ల కలలు కల్లలు చేస్తోంది. చదువు, ఉద్యోగంతో పాటు చివరికి పర్యాటకం కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. ఒక్క H1B visa మాత్రమే కాకుండా దాదాపుగా అన్ని రకాల విసాలకు చెల్లించాల్సిన ఫీజులు భారంగా పరిణమించాయి. ఫీజులు పెంచిన తర్వాత రెండు నెలల కాలంలోనే వీసా దరఖాస్తులు సగానికి పైగా పడిపోయినట్లు టెక్ ఆర్గనైజేషన్స్ చెబుతున్నాయి.

సెప్టెంబర్ 19న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. దీనిపై విదేశాల్లోనే కాకుండా అటు స్వదేశంలోనూ తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అమెరికాలోనూ దీన్ని వ్యతిరేకించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. లక్ష డాలర్ల ఫీజును విధించడాన్ని సవాలు చేస్తూ పలు అసోసియేషన్లను కలిసి ఉమ్మడిగా ఈ పిటీషన్ ను దాఖలు చేశాయి. పలు ఉద్యోగ సంఘాల యూనియన్లు, విద్యావేత్తలు.. కాలిఫోర్నియా నార్త్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించాయి.

H1B Visa Fee Costs a Barrier to Your US Dreams

ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారంలో యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఎంటర్ అయింది. ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ పాలసీ ఆఫీసర్ నీల్ బ్రాడ్లీ ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. ఫీజు పెంపు వల్ల అమెరికాలో ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని, ప్రత్యేకించి- స్టార్టప్‌లు, చిన్న, మధ్యతరహా సంస్థలకు ఇది పెను భారంగా మారుతుందని తెలిపారు. ఫీజు చెల్లించి ఉద్యోగులను రప్పించుకోవడం అనేది ఖర్చుతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు.

అలాంటి అభిప్రాయాన్నే తాజాగా భారతీయ పారిశ్రామిక, టెక్ అసోసియేషన్లు కూడా వ్యక్తం చేస్తోన్నాయి. కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం వీసా సంబంధిత ఖర్చులు ఆకాశాన్నంటుతున్నాయి. విస్తృతమైన ఇమ్మిగ్రేషన్ ఫీజుల పెంపు.. విద్యార్థులు, నిపుణులు, పర్యాటకులు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు సహా దాదాపు ప్రతి రకమైన వీసా దరఖాస్తుదారుడిపై ప్రభావం చూపుతోంది.

ఈ ఫీజు F-1, J-1, స్టూడెంట్ విసా, B-1/B-2 పర్యాటక వీసాలు, అన్ని వర్క్ రిలేటెడ్ కేటగిరీలకు వర్తిస్తోంది. ఇమ్మిగ్రేషన్ తాజా నిబంధనల ప్రకారం.. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) దరఖాస్తు ఫీజు 470 డాలర్లకు పెరిగింది. పేపర్ ఫైలింగ్‌లకు అదనంగా మరో 520 డాలర్లను చెల్లించాల్సి వస్తోంది. గతంలో రెఫ్యూజీలు, టెంపరరీ ప్రొటెక్టెడ్ సర్వీస్ కేటగిరీలకు ఇందులో నుంచి మినహాయింపు ఉండేది. ఇప్పుడు దీన్ని తొలగించారు. పెరోల్ స్థితిలో ఉన్న వలసదారులు ఇప్పుడు పూర్తి మొత్తాన్ని చెల్లించాలి.

అంతర్జాతీయ ప్రయాణికులు సరిహద్దులో అదనపు ఛార్జీలను ఎదుర్కోవలసి ఉంటుంది. సందర్శకులు ఇప్పుడు కస్టమ్ సీబీపీ ఫాం ఐ-94 అరైవల్ అండ్ డిపార్చర్ రికార్డుకు కూడా డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ESTA, EVUS వంటి సిస్టమ్‌ల కోసం పెరిగిన ఫీజులు అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వం వీసా ఇంటర్వ్యూ మినహాయింపు (డ్రాప్‌బాక్స్) సౌలభ్యాన్ని కూడా కఠినతరం చేసింది. 14 ఏళ్ల లోపు, 79 ఏళ్లు పైబడిన దరఖాస్తుదారులు తప్పనిసరిగా వ్యక్తిగత ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+