మాజీ సీఎంకు సినిమా చూపించిన హ్యాకర్లు, ఫోటోలు వైరల్, వారం రోజులు అంతే!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఫేస్‌బుక్ ఖాతాను హ్యాకర్లు హ్యాక్ చేసిన ఘటన శనివారం కలకలం రేపింది. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అధికారిక ఫేస్ బుక్ ఖాతా ప్రొఫైల్ చిత్రం, కవర్ ఫోటో అకస్మాత్తుగా మారిపోయింది. ఇలా ఫోటో మార్చడం పెద్ద ఎత్తున వైరల్ కావడతో కలకలం సృష్టించింది.
మాజీ సీఎం కుమారస్వామి అధికారిక ఫేస్‌బుక్ ఖాతా ప్రొఫైల్ ఇమేజ్‌పై దుండగులు విదేశీ యువతి ఫొటో పెట్టారు. అలాగే కవర్ ఫోటోపై ఇంకో ఫోటో ఉంచారు. మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి అభిమానులు, ఆయన సోషల్ మీడియా బృందం వెంటనే దీనిని గమనించి తప్పును సరిదిద్దారు. అయితే ఇది ఎందుకు జరిగింది ? అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే హెచ్‌డీ కుమారస్వామి ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయిందా? అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం తెలియగానే నిందితులు పెట్టిన ఫోటోను డిలీట్ చేసి వేరే ఫోటో పెట్టారు. కానీ అప్పటికి అప్‌డేట్ చేయబడిన ప్రొఫైల్ ఇమేజ్, కవర్ ఫోటో కామెంట్‌లు రావడం మొదలైనాయి. వెంటనే అలెర్ట్ అయిన కొందరు ఫేస్ బుక్ యూజర్లు మీ అకౌంట్ హ్యాక్ అయ్యిందని మాజీ సీఎం కుమారస్వామికి తెలియజేశారు. ఈ విషయం తెలియగానే మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి జేడీఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తున్న టీమ్ ను అప్రమత్తం చెయ్యడంతో ఆ ఫోటోలను తొలగించారు.
మరో వారం రోజులు రాజకీయాల గురించి మాట్లాడను, దానికి కారణం మనం అందరం ఇప్పుడు చంద్రయాన్-3 విజయం ఆనందంలో ఉన్నాము. ఈరోజు దేశ విదేశాల్లో చంద్రయాన్ -3 విజయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారని, భారత్ కు ప్రశంసలు వస్తున్నాయని. అందరి దృష్టి చంద్రయాన్-3 మీదే ఉందని, అందుకే వారం రోజులు తాను రాజకీయాల గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను అని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు.

భారత శాస్త్రవేత్తల అలుపెరగని కృషి వల్ల దేశ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు వచ్చి శాస్త్రవేత్తలను అభినందించారు. కాబట్టి రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడను అని కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ దళపతి హెచ్ డీ. కుమారస్వామి అన్నారు.












Click it and Unblock the Notifications