వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో కలకలం: ‘హఫీజ్ సయీద్, పాక్ జిందాబాద్’ అంటూ ర్యాలీ

ముంబై పేలుళ్ల సూత్రధారి, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా చీఫ్‌ హహీజ్‌ సయీద్‌ను పాకిస్థాన్‌ ప్రభుత్వం గృహనిర్భంధం నుంచి విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని లక్ష్మీపూర్‌ గ్రామం

|
Google Oneindia TeluguNews

లక్ష్మీపూర్‌: ముంబై పేలుళ్ల సూత్రధారి, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా చీఫ్‌ హహీజ్‌ సయీద్‌ను పాకిస్థాన్‌ ప్రభుత్వం గృహనిర్భంధం నుంచి విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని లక్ష్మీపూర్‌ గ్రామంలో కొందరు వేడులు నిర్వహించడం కలకలం రేపింది.

హహీజ్‌ సయీద్‌ విడుదలపై ఉత్తర్‌ ప్రదేశ్‌లో వేడుకలు నిర్వహించడం, పాక్ జిందాబాద్ అంటూ ర్యాలీ చేయడం వివాదాస్పదంగా మారింది. శివపురి ప్రాంతంలోని బేగంబాగ్‌ కాలనీలో కొందరు హఫీజ్‌ సయీద్‌ విడుదల అనంతరం.. 'హఫీజ్‌ సయీద్‌ జిందాబాద్‌', 'పాకిస్తాన్‌ జిందాబాద్‌' అంటూ నినాదాలు చేశారు. అంతేగాక, పాక్ జెండా అయిన ఆకుపచ్చ జెండాలను ఎగురవేశారు.

Hafiz Saeed's release celebrated in UP's Lakhimpur

ఈ ఘటన కలెక్టర్‌ అక్షద్వీప్‌ దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. పూర్తి ఆధారాలతో విచారణ నిర్వహించాలని ఆయన పోలీసులను ఆదేశించారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం హఫీజ్‌ సయీద్‌కు అనుకూలంగా 20-25 మంది యువకులు నినాదాలు చేసినట్లు కత్వాలి పోలీసులకు మొదటి సమాచారం అందింది. అయితే ఈ ఘటన తీవ్రతను మొదటగా అధికారులు గుర్తించనట్లు తెలుస్తోంది.

కాగా, జిల్లా కలెక్టర్‌ అక్షద్వీప్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే పలు ఇళ్లపై ఎగరేసిన ఆకుపచ్చ జెండాలను అధికారులు తొలగించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హఫీజ్‌ సయాద్‌, పాకిస్తాన్‌కు అనుకూలంగా చేసిన నినాదాలు, వేడుకులకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ లభించిందని.. పోలీసులు ప్రకటించారు.

యువకులు చేసిన నినాదాలకు సంబంధించి వీడియో ఫుటేజ్‌ ఉందని పోలీసులు ప్రకటించారు. ఇది ఇలావుంటే.. ఈ ఘటనపై లక్ష్మీపూర్‌ ఇమామ్‌ అష్పాఖ్‌ ఖాద్రీ మాట్లాడుతూ.. హఫీజ్‌ సయీద్‌ విడుదలపై వేడుకలు చేసుకోలేదని చెప్పారు. హహీజ్‌కు అనుకూలంగా నినాదాలు ఎవరూ చేయలేదని కూడా ఆయన ప్రకటించారు. తామంతా జులూస్‌ ఏ మహమ్మదీ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకున్నట్లు ఆయన చెప్పడం గమనార్హం.

English summary
Some persons in Uttar Pradesh's Lakhimpur city allegedly celebrated 26/11 Mumbai terror attack mastermind and JuD chief Hafiz Saeed's release from house arrest in Pakistan. The situation was immediately diffused after the intervention of the district administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X