మా దెబ్బకు సిద్ధంగా ఉండండి, మెరుపు దాడి రుచి చూపిస్తాం: సయీద్ హెచ్చరిక
న్యూఢిల్లీ: భారత్ సర్జికల్ స్ట్రయిక్ పైన జమాత్ ఉధ్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ స్పందించాడు. అతను పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడాడు. భారత మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందని ఆరోపించాడు. మెరుపు దాడులు ఎలా ఉండాయో భారత్‌కు రూచి చూపిస్తామన్నాడు.
అసలు నిజమైన మెరుపు దాడులు అంటే అంటే ఏమిటనేది ప్రతి భారతీయుడికి రుచి చూపిస్తామని హెచ్చరించాడు. త్వరలోనే తమ దళాలు భారత దేశానికి తగిన గుణపాఠం చెబుతాయన్నాడు. అందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు. దాడులు రుచి చూపిస్తామని మన మీడియాకు కూడా సవాల్ విసిరాడు. అదే సమయంలో పాకిస్తాన్ దళాలను పొగడ్తలలో ముంచెత్తాడు.

కాగా, భారత్ - పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వాటిని నివారించేందుకు రెండు దేశాలతోనూ వివిధ మార్గాల్లో సంప్రదిస్తున్నట్లు చైనా ఇది వరకే తెలిపింది. ప్రాంతీయంగా శాంతి భద్రతలు నెలకొనేందుకు ఉభయ పక్షాలూ కలిసి పనిచేయాలని ఆశిస్తున్నట్లు చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జెంగ్ షౌంగ్ పేర్కొన్నారు.
రెండు దేశాలూ సమాచారాన్ని వృద్ధి చేసుకోవాలన్నారు. భారత్, పాక్‌లకు చైనా స్నేహశీల పొరుగు దేశమని, ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాల్లో సహకారం మెరుగు పరుచుకోవడానికి రెండు దేశాలూ చర్చలు-సంప్రదింపుల ద్వారా తగురీతిలో వ్యవహరించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications