Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వెంటనే ఆక్సిజన్ మళ్లింపు ఆపేయండి.. లేదంటే చెన్నైలో పెను సంక్షోభమే : ప్రధానికి తమిళ సీఎం లేఖ

తమిళనాడులోని ఆక్సిజన్ ప్లాంట్స్ నుంచి తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లకు వెంటనే సప్లై నిలిపివేయాలని ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తమిళనాడులో ఆక్సిజన్ అవసరమవుతున్న యాక్టివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నందునా ఇక్కడ ఉత్పత్తయ్యే ఆక్సిజన్ ఇక్కడి అవసరాలకే సరిపోతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుండగా... మున్ముందు 450 టన్నుల మేర ఆక్సిజన్ అవసరమవుతుందని పేర్కొన్నారు.

లేఖలో పళనిస్వామి ఏమన్నారంటే...

లేఖలో పళనిస్వామి ఏమన్నారంటే...

ప్రస్తుతం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణ రాష్ట్రాలకు 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నారు. గతేడాది కరోనా మొదటి వేవ్ సందర్భంగా రాష్ట్రంలో 58వేల యాక్టివ్ కేసులు ఉన్నాయని... ఇప్పుడా సంఖ్య లక్షకి చేరిందని గుర్తుచేశారు. కాబట్టి తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లకు తమిళనాడు నుంచి కేటాయించిన ఆక్సిజన్‌ను నిలిపివేయాలన్నారు. నిజానికి రాష్ట్రంలో ఉన్న యాక్టివ్ కేసులకు అవసరమయ్యే ఆక్సిజన్ కంటే తక్కువ ఆక్సిజన్‌ను తమకు కేటాయించారని పేర్కొన్నారు.

ఇది సమంజసం కాదు : పళనిస్వామి

ఇది సమంజసం కాదు : పళనిస్వామి

'తమిళనాడులో ఇప్పటికే ఆక్సిజన్ వినియోగం 310 మెట్రిక్ టన్నులు దాటింది. కానీ రాష్ట్రానికి కేటాయించింది మాత్రం 220 మెట్రిక్ టన్నులే. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌లో 80 మెట్రిక్ టన్నులు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లకు పంపిస్తున్నారు. తమిళనాడుకు ఆక్సిజన్ కేటాయింపు విషయంలో కేంద్రం అంచనా సరిగా లేదు. మాకంటే తక్కువ యాక్టివ్ కేసులు ఉన్న రాష్ట్రాలకు.. అందునా భారీ స్టీల్ పరిశ్రమలు ఉన్న రాష్ట్రాలకు మా వద్ద నుంచే ఆక్సిజన్ కేటాయింపులు చేస్తున్నారు. సౌతిండియాలో అత్యధిక కేసులున్న చెన్నై నగరానికి ఆక్సిజన్ సప్లై చేసే శ్రీపెరుంబుదూర్ ప్లాంట్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ మళ్లించడం సమంజసంగా లేదు.' అని ప్రధానికి రాసిన లేఖలో పళని పేర్కొన్నారు.

ఇది సంక్షోభానికి దారితీస్తుంది : పళనిస్వామి

ఇది సంక్షోభానికి దారితీస్తుంది : పళనిస్వామి

తమిళనాడు నుంచి ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను మళ్లించడం చెన్నైలో పెద్ద సంక్షోభానికి దారితీస్తుందని పళనిస్వామి పేర్కొనడం గమనార్హం. ఇప్పటికైనా శ్రీపెరుంబుదూర్ ప్లాంట్ నుంచి ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తున్న 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సప్లైని నిలిపివేయాలని ప్రధానిని కోరారు. కరోనా ఉధృతి రీత్యా ఇప్పటికే తమిళనాడులో సామూహిక కార్యక్రమాలు,దేవాలయాల్లోని కార్యక్రమాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే నిర్ణయించిన కార్యక్రమాలను మాత్రం కేవలం 50 మందితో నిర్వహించేలా అనుమతులిచ్చారు. ఏప్రిల్ 26 నుంచి బ్యూటీ పార్లర్స్,సెలూన్లు,స్పా,క్షౌర శాలలు అన్ని మూతపడనున్నాయి. హోటల్స్,రెస్టారెంట్లను కేవలం టేక్ అవేకి మాత్రమే పరిమితం చేస్తారు. ఇక నైట్ కర్ఫ్యూ,వీకెండ్ లాక్‌డౌన్ ఇప్పటికే అమలులో ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+