హమారా భారత్... జెండా ఊంఛా రహే హమారా
భారతదేశం 1947 ఆగస్టు 15వ తేదీన ఆంగ్లేయుల నుంచి స్వాతంత్ర్యం పొందిన తర్వాత ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని రూపొందించుకుంది. ఇది 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చింది. మన దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం.
ప్రతి సంవత్సరం జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో సైనిక కవాతుతోపాటు సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. భారతదేశం ఆరోజు తన బలాన్ని ప్రపంచానికి చాటుతుంది. వేడుకలను వీక్షించేందుకు ప్రధానమంత్రితోపాటు కేంద్ర మంత్రి మండలి సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులంతా హాజరవుతారు. కార్యక్రమం మొత్తానికి శకటాల ప్రదర్శన హైలైట్ అవుతుంది. సైనికుల కవాతు రాష్ట్రపతి భవన్ వద్ద ఉన్న రైసినా హిల్ లో ప్రారంభమై ఇండియాగేట్ నుంచి ఎర్రకోట వరకు జరుగుతుంది. సుమారు ఐదు కిలోమీటర్లు ప్రదర్శన ఉంటుంది.

ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్‌లో రక్షణ దళాలకు చెందిన రెండు మహిళా బృందాలు కవాతు చేస్తున్నాయి. ఒక్కో బృందంలో 144 మంది మహిళలుంటారు. 60 మంది ఆర్మీకి చెందినవారు కాగా మిగిలినవారు వాయుసేన, నేవీకి చెందినవారు. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2274 క్యాడెట్లు నెలరోజులపాటు జరిగే రిపబ్లిక్ డే క్యాంప్ లో పాల్గొంటారు.
2024 రిపబ్లిక్ డే థీమ్ India-Mother of Democracy, ''విక్షిత్ భారత్'' అని అర్థం. గణతంత్ర కవాతు లైవ్ ఉదయం 9.00 గంటలకు ప్రారంభమవుతుంది. ఫోన్, ల్యాప్‌టాప్‌లో దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ల్లో ప్రత్యక్షంగా చూడొచ్చు. టీవీలు అందుబాటులో లేనివారు మొబైల్స్ లో వీక్షించవచ్చు.












Click it and Unblock the Notifications