భార్య వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్య.. ఏం జరిగింది?

Subscribe to Oneindia Telugu

నాసిక్: భార్య, అత్తమామలు కలిసి పెడుతున్న హింస భరించలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలోని నాసిక్ లో చోటు చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలను సూసైడ్ నోట్ లో రాసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. మానసికంగా, శారీరకంగా వారు పెడుతున్న వేధింపులు తాళలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా లేఖలో తెలిపాడు.

పోలీసుల కథనం ప్రకారం.. నాసిక్ సమీపంలోని ఓఝార్ టౌన్ షిప్ కు చెందిన సంతోష్ పవార్(32) స్థానికంగా ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే ఇంట్లో వాతావరణం అతనికి ఏమాత్రం నచ్చేది కాదు. ఎప్పుడూ తన భార్య, అత్త మామ చేతిలో తరుచు వేధింపులకు గురయ్యేవాడు.

Harassed by wife, man commits suicide

ఎన్నిసార్లు ప్రయత్నించినా.. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో.. ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. చనిపోయే ముందు ఒక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు కారణం.. భార్య, అత్త మామలు పెడుతున్న శారీరక, మానసిక హింసేనని పేర్కొన్నాడు.

సంతోష్ పవార్ ఆత్మహత్యపై అతని సోదరుడు సచిన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సంతోష్ భార్య ప్రియా పవార్, అత్త మామలు కృష్ణా షిండే, విష్ణు షిండే, అప్పా బోర్గుడేలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 32-year-old man allegedly committed suicide at his house in Ojhar township near here after being harassed by his wife, police said today.
Please Wait while comments are loading...