తక్కువ మార్కులు వేశాడని టీచర్‌పై క్లాస్‌రూమ్‌లోనే దాడి
మార్కులు తక్కువ వచ్చాయని టీచర్‌పై ఓ విద్యార్థి తరగతి గదిలోనే హత్యాయత్నానికి ప్రయత్నించారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకొంది.మార్కులు తక్కువ వేయడమే కాదు అందరి ముందు అవమానించాడని కక్షపెంచుకొన్న వ
చంఢీగఢ్: మార్కులు తక్కువ వచ్చాయని టీచర్‌పై ఓ విద్యార్థి తరగతి గదిలోనే హత్యాయత్నానికి ప్రయత్నించారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకొంది.మరో టీచర్ వచ్చి విద్యార్థిని బెదిరిచడంతో ఆ విద్యార్థి కాస్త వెనక్కు తగ్గారు.
హర్యానాలో 12వ, తరగతి చదివే విద్యార్థి ఏకంగా క్లాస్ రూంలోనే టీచర్‌ను చంపేందుకు యత్నించాడు. ఝజ్జర్ జిల్లా నజఫ్‌గడ్ రోడ్‌లో ఉన్న హర్దయాల్ పబ్లిక్ స్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. క్లాస్ రూంలో పేపర్లు దిద్దుకుంటున్న టీచర్‌పై 12వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థి ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు.

తన బ్యాగులో అప్పటిదాకా దాచుకున్న ఆయుధంతో ఒక్కసారిగా దాడి చేశాడు. ఊహించని ఆ పరిణామానికి బిత్తరపోయిన ఆ టీచర్ ప్రతిఘటించలేక బయటకు పరిగెత్తాడు. అయినా వదలని ఆ విద్యార్థి వెంటపడి గాయపరచసాగాడు. ఇంతలో మరో టీచర్ వచ్చి బెదిరించటంతో కాస్త వెనక్కి తగ్గిన ఆ విద్యార్థిని ఇతర విద్యార్థుల సాయంతో కట్టడి చేయగలిగారు.
పరీక్షలో తక్కువ మార్కులు వేయటంతోపాటు.. అందరి ముందు తిట్టాడన్న కోపంతోనే ఈ స్టూడెంట్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. దీనికిగానూ మరో విద్యార్థి కూడా సహకరించటంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. తలపై తీవ్ర గాయాలు కావటంతో టీచర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన స్కూల్ యాజమాన్యం శనివారం పేరెంట్స్ మీటింగ్ ను ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications