ఢిల్లీలో కాలుష్యం: కేజ్రీవాల్‌కు హర్యానా సీఎం సూటి ప్రశ్న

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: హర్యానా, పంజాబ్‌కు చెందిన రైతులు పంటలకు నిప్పు పెట్టినందువల్ల కాలుష్యం ఎక్కువవుతోందని ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఇందుకు సంబంధించి చర్చించేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలకు లేఖ రాసినట్లు చెప్పారు.

దీనిపై హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టార్‌ స్పందించారు. తాను సోమ, మంగళవారాలు ఢిల్లీలోనే ఉంటానని, సమావేశం ఎక్కడ చెప్పాలని ఖట్టార్ ప్రశ్నించారు. నేను వచ్చానని, మీ కార్యాలయం నుంచి స్పందన ఏదని అడిగారు.

Haryana CM Manohar Lal Khattar to meet Arvind Kejriwal on air pollution issue

మీ రాష్ట్రంలోనూ 40,000 రైతులు ఉన్నారని, మరి మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. హర్యానాలో పంటలకు సంబంధించి తాము అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నామని, పంటలకు నిప్పు పెట్టొద్దని చెప్పామన్నారు. చెప్పాలంటే పంజాబ్‌ వల్లే కాలుష్యం ఎక్కువవుతోందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Haryana Chief Minister Manohar Lal Khattar may meet Delhi state chief, Arvind Kejriwal on Monday to discuss the issue of pollution that has beset the northern part of India.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి