హర్యానా హస్తగతమే-తేల్చేసిన మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్-ఎన్ని సీట్లంటే..!

హర్యానాలో ఇవాళ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతోందన్న అంశంపై ప్రముఖ సర్వే సంస్థ మ్యాట్రిజ్ తమ అంచనాల్ని విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ఘన విజయం సాధించబోతున్నట్లు తేల్చేసింది. బీజేపీతో ముఖాముఖీ తలపడిన కాంగ్రెస్ పార్టీ ఈ పోరులో విజేతగా నిలబోతున్నట్లు మ్యాట్రిజ్ సర్వే తేల్చింది. అధికార బీజేపీ రెండో స్ధానంలో నిలవబోతున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ ప్రకటించింది.

మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం 90 సీట్లున్న హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 55 నుంచి 62 సీట్లు సాధించి ఏకపక్ష విజయాన్ని సొంత చేసుకోబోతోంది. అలాగే బీజేపీ కేవలం 18-24 సీట్లకు పరిమితం కాబోతున్నట్లు ఎగ్జిట్ పోల్ తేల్చింది. అటు జేజేపీ కూటమి కేవలం 0-3 సీట్లు, ఐఎన్ఎల్డీ కూటమి కూడా 3-6 సీట్లు మాత్రమే గెల్చుకునే అవకాశం ఉన్నట్లు మ్యాట్రిజ్ తేల్చేసింది. దీంతో హర్యానా తీర్పు ఎలా ఉండబోతోందో తేలిపోయింది.

Haryana exit polls 2024 matrize exit poll says congress likely to sweap Haryana with 59 seats

హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉండగా.. వీటిలో విజయం కోసం దాదాపు వెయ్యి మంది అభ్యర్ధులు రంగంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో దాదాపు రెండు కోట్ల మంది ఓటర్లు ఈసారి ఓటేశారు. ఇందులో కాంగ్రెస్, బీజేపీ, జేజేపీ-ఏఎస్పీ, ఐఎన్ఎల్డీ-బీఎస్పీ, ఆప్ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. సాయంత్రం ఐదు గంటల కల్లా దాదాపు 61 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఈ నెల 8న హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+