మిస్ ఇండియాగా హర్యానా బ్యూటీ
ఈ ఏడాది మిస్ ఇండియాగా హర్యానాకు చెందిన మానుషి ఛిల్లార్ ఎంపికైంది. ప్రతిష్ఠాత్మక 54వ మిస్ ఇండియా పోటీలు ఆదివారం రాత్రి ముంబైలోని యష్‌రాజ్ ఫిల్మ్ స్టూడియోలో జరిగాయి.
న్యూఢిల్లీ: ఈ ఏడాది మిస్ ఇండియాగా హర్యానాకు చెందిన మానుషి ఛిల్లార్ ఎంపికైంది. ప్రతిష్ఠాత్మక 54వ మిస్ ఇండియా పోటీలు ఆదివారం రాత్రి ముంబైలోని యష్‌రాజ్ ఫిల్మ్ స్టూడియోలో జరిగాయి.
మిస్ ఇండియా 2017 కిరీటాన్ని మానుషి కైవసం చేసుకోగా, తొలి రన్నరప్‌గా మిస్ జమ్మూ సనా దువా, రెండో రన్నరప్‌గా మిస్ బీహార్ ప్రియాంక కుమారి నిలిచారు.

ఒక విజన్‌తో తాను సాగించిన జర్నీ ఫలించిందని మానుషి సంబరం వ్యక్తం చేసింది. హర్యానాకు చెందిన మానుషి ఢిల్లీలోని సెయింట్ థామస్ స్కూలులో చదివారు. తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే కావడంతో తాను సైతం వైద్యవిద్యనే ఎంచుకున్నారు.
సోనిపట్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించారు. 30 మంది వివిధ రాష్ట్రాల అందాల భామలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. తుది పోటీలో ఆరుగురు నిలిచారు.












Click it and Unblock the Notifications