ఈవ్ టీజర్లను బెల్టుతో చితకబాదిన అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వం నజరానా (ఫోటో)

రోహతక్: తమను వేధిస్తున్న వారికి ఇద్దరు అక్కాచెల్లెళ్లు బుద్ధి చెప్పిన సంఘటన హర్యానా రాష్ట్రంలోని రోహతక్‌లో జరిగిన విషయం తెలిసిందే. ధైర్యం ప్రదర్శించిన ఆ యువతులకు హర్యానా ప్రభుత్వం రివార్డ్ ప్రకటించింది. రూ.31,000 రివార్డును ప్రకటించింది.

ముఖ్యమంత్రి ఎమ్మెల్ ఖట్టార్ ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లను సన్మానిస్తారని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. యువతుల పైన వేధింపులు ఆపనందుకు కండక్టర్, డ్రైవర్‌ను సస్పెండ్ చేశారు. బస్సులో యువతులను వేధించడం, వేధించిన వారిని అక్కాచెల్లెళ్లు చితకబాదిన వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ సృష్టిస్తోన్న విషయం తెలిసిందే.

22 ఏళ్ల ఆర్తి కుమార్, అమె సోదరి, పందొమ్మిదేళ్ల పూజాలు బెల్టుతో నిందితులను కొడుతుండగా ప్రయాణీకులు వీడియో తీశారు. ఆ వీడియోలో ప్రయాణీకులు ఎవరు కూడా ఈవ్ టీజీంగును అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినట్లుగా కనిపించడం లేదు.

Haryana govt announces cash reward for Rohtak sisters

అదే బస్సులో ఓ గర్భిణీ మహిళ కూడా ఉంది. ఆమె మాత్రం ఈవ్ టీజీంగ్‌ను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఈవ్ టీజింగ్‌కు పాల్పడిన ముగ్గురు యువకులు వారిద్దరిని వేధించారు. దీనిని గర్భిణీ స్త్రీ అడ్డుకునే ప్రయత్నాలు చేసింది. దీంతో వారు ఆమెను కూడా టార్గెట్ చేశారు. దీంతో, ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు చితకబాదారు. అనంతరం వారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారు అసన్ గ్రామానికి చెందినవారు. కాగా, బస్సులలో మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకుంటామని ఖట్టార్ ప్రభుత్వం తెలిపింది. ఈ యువతుల ధైర్యం పైన వారి తండ్రి రాజేష్ కుమార్ మాట్లాడుతూ.. తాను గర్విస్తున్నానని, మిగతా మహిళలు కూడా ఇలాగే ఉండాలన్నారు. ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్‌లో ఉద్యోగం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+