viral video: నువ్వేం టీచర్ తల్లి.. 2వ తరగతి విద్యార్థిని..
ఇటీవలకాలంలో పాఠశాలల్లో విద్యార్థులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులతో కాళ్లు పట్టించుకోవడం, వారిని ఇతర కార్యకలాపాలకు వాడుకోవడం లాంటి ఘటనలు అనేకం జరిగాయి. పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ఇలా ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హరియాణాలోని పానిపట్ లో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. హోం వర్క్ చేయలేదని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి బాలుడ్ని కిటికీకి తలకిందులుగా వేలాడదీసి దారుణంగా కొట్టింది ఓ టీచర్. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పించాల్సిన టీచర్లు వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. పిల్లలు చేసే చిన్న చిన్న తప్పులకే వారికి పెద్ద పెద్ద శిక్షలు విధిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హరియాణాలో జరిగింది. హరియాణాలోని పానిపట్ లో ఓ ప్రైవేట్ స్కూల్ లో రెండో తరగతి చదువుతున్న చిన్నారికి ఊహించని శిక్ష వేసింది ఆ స్కూల్ యాజమాన్యం. కిటికీకి తలకిందులుగా వేలాడదీసి ఈ పని చేసింది. హోం వర్క్ చేయకపోవడం కారణంగా ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు పాఠశాల డ్రైవర్ అజయ్, స్కూల్ ప్రిన్సిపాల్ రీనాను అరెస్టు చేశారు.
હરિયાણામાં ખાનગી શાળામાં વિદ્યાર્થી સાથે ક્રુરતા
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) September 29, 2025
બે અલગ અલગ વીડિયો સોશિયલ મીડિયામાં વારયલ થયા છે
નોંંધઃ વીડિયો એકાદ મહિના પહેલાનો છે, પરંતુ વાલીઓને અત્યારે જાણ થતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંંધાવી છે#Panipat #viralvideo pic.twitter.com/oRbd10Et7M
ఇదే ఘటనపై బాలుడి తల్లి మాట్లాడుతూ.. తన 7 ఏళ్ల కుమారుడు హోం వర్క్ పూర్తి చేయలేదని.. దాంతో పాఠశాల ప్రిన్సిపాల్ డ్రైవర్ అజయ్ కు ఫోన్ చేశాడు. ఆ పిల్లవాడిని శిక్షించమని కోరాడు. అజయ్ ఆ పిల్లవాడిని మేడమీద ఉన్న గదికి తీసుకెళ్లి, తాడుతో కట్టి, కిటికీకి తలకిందులుగా వేలాడదీసి, చెంపదెబ్బ కొట్టాడు. అంతేకాక ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అది వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications