వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట, హర్యానా‌లో వార్ వన్‌సైడే! హుజూర్ నగర్‌లో కారు జోరు సాగే..

|
Google Oneindia TeluguNews

తెలంగాణలోని హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక, హర్యానా, మహారాష్ట్ర‌లోని అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ రెండు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 51 శాసన సభా స్థానాలకు ఉప ఎన్నికల సంగ్రామం రసవత్తరంగా మారింది. అక్టోబర్ 21వ తేదీన పోలింగ్ చెదురు మదురు సంఘటనతలతో ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 24 తేదీన 17 రాష్ట్రాల్లో 51 అసెంబ్లీ స్థానాలకు, హర్యానా, మహారాష్ట్రకు సంబంధించిన ఫలితాలు వెలువడున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన మీడియా సంస్థలు న్యూస్ ఎక్స్, ఇండియా టుడే, రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ, న్యూస్ 18 లాంటి, ఇండియా టీవీ లాంటి సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించే అవకాశం ఉంది.

సోమవారం (అక్టోబర్ 21వ తేదీన) ఉదయం నుంచి రాత్రి వరకు సమగ్రంగా అందించేందుకు తెలుగు వన్ ఇండియా సిద్ధమైంది. అభ్యర్థుల అధ్యికత, గెలుపు ఓటములు సమాచారం.. పార్టీల బలాబలాలు, ఫలితాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెబ్ మాధ్యమం ద్వారానే కాకుండా ఫేస్‌బుక్, ట్విట్టర్, హలో యాప్ లాంటి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పాఠకులకు అందించేందుకు అత్యాధునిక సాంకేతికతతో తెలుగు ఇండియా టుడే ముందుకొస్తున్నది. వార్తలు, వీడియో కథనాల కోసం నిరంతర ప్రత్యక్ష వార్తా సమాచారం కోసం telugu.oneinida.com ఫాలో అవ్వండి.

Haryana, Maharashtra, HuzurNagar Exit polls: live coverage of election results analysis

Newest First Oldest First
7:42 PM, 21 Oct

మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా

ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీ 109 నుంచి 124 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. శివసేన 57 నుంచి 70 సీట్ల మధ్య గెలుచుకొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ 32 నుంచి 40 సీట్ల వరకు.. ఎన్సీపీ 40 నుంచి 50 సీట్ల వరకు విజయం సాధిస్తుంది అని అంచనా వేశారు.
7:28 PM, 21 Oct

హుజూర్ నగర్: మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో గులాబీ జెండా రెపరెపలాడుతుందని మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది. టీఆర్ఎస్ 53 శాతం, కాంగ్రెస్ 41 శాతం, బీజేపీ 1.17 శాతం ఓట్లు సాధిస్తుందని అంచనా వేసింది.
7:26 PM, 21 Oct

హుజూర్ నగర్‌లో కారు జోరు

తెలంగాణలో హుజూర్ నగర్‌లో కారు జోరు కొనసాగుతుందని ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. టీఆర్ఎస్‌కు 50 శాతం, కాంగ్రెస్‌కు 39.95 శాతం, ఇతరులకు 9.57 శాతం ఓట్లు రావోచ్చని సంస్థ అభిప్రాయపడింది.
7:20 PM, 21 Oct

News 24 Exit Polls ప్రకారం మహారాష్ట్రలో

మహారాష్ట్రలో బీజేపీ 230 సీట్లు, కాంగ్రెస్ 48 సీట్లు, ఇతరులు 10 సీట్లలో విజయం సాధిస్తారని న్యూస్ 24 తన ఎగ్జిట్ పోల్స్‌లో స్పష్టం చేసింది.
7:16 PM, 21 Oct

ఏబీపీ న్యూస్- సీ ఓటర్ తీర్పు

ఏబీపీ న్యూస్- సీ ఓటర్ తీర్పు
మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి రానున్నదనే విషయాన్ని ఏబీపీ న్యూస్- సీ ఓటర్ తన ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించింది. బీజేపీ 204 సీట్లలో, కాంగ్రెస్ 69 సీట్లు, ఇతరులు 15 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది.
7:09 PM, 21 Oct

మహారాష్ట్రలో సీఎన్ఎన్ న్యూస్ 18 ప్రకారం..

మహారాష్ట్రలో మరోసారి బీజేపీ అధికారాన్ని చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ 243 సీట్లలో, కాంగ్రెస్ 41 స్థానాల్లో, ఇతరులు 4 సీట్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయని సీఎన్ఎన్ న్యూస్ 18 తన ఎగ్జిట్ పోల్‌లో వెల్లడించింది.
7:03 PM, 21 Oct

సీఎన్ఎన్ ఐబీఎన్ ప్రకారం మహారాష్ట్రలో

మహారాష్ట్రలో బీజేపీ 243, కాంగ్రెస్ 41 సీట్లు, ఇండిపెండెంట్లు 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అని సీఎన్ఎన్ ఐబీఎన్ ఎగ్జిట్ పోల్స్‌లో స్పష్టమైంది. దాంతో మరోసారి మహారాష్ట్రలో కాషాయం జెండా రెపరెపలాడే అవకాశం కనిపిస్తున్నది.
7:01 PM, 21 Oct

మహారాష్ట్రలో ఎన్డీటీవీ ప్రకారం

మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అని ఎన్డీటీవీ తన ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించింది. బీజేపీకి 211 సీట్లు, 64 సీట్లలో కాంగ్రెస్, 13 ఇండిపెండెంట్స్ గెలిచే అవకాశం ఉంది అని ఎన్డీటీవీ పేర్కొన్నది.
6:58 PM, 21 Oct

ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..

హర్యానాలో బీజేపీ 66 సీట్లు, కాంగ్రెస్ 14 సీట్లు, ఇండిపెండెంట్స్ 10 సీట్లలో గెలుస్తారని ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్‌లో వెల్లడించింది.
6:56 PM, 21 Oct

హర్యానాలో టౌమ్స్ నౌ ప్రకారం..

హర్యానాలో టౌమ్స్ నౌ ప్రకారం.. బీజేపీ 71 స్థానాలు, కాంగ్రెస్ 11 సీట్లు, 8 సీట్లలో ఇండిపెండెట్స్ గెలుచుకొనే అవకాశం ఉంది.
6:54 PM, 21 Oct

హర్యానాలో రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్ ప్రకారం..

హర్యానాలో రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. బీజేపీ 52 నుంచి 63 వరకు, కాంగ్రెస్ 15 నుంచి 19 సీట్లు, ఇతరులు 12 సీట్లు గెలుచుకొనే అవకాశం ఉందనే విషయం స్పష్టమైంది.
6:54 PM, 21 Oct

హర్యానాలో రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్ ప్రకారం..

హర్యానాలో రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. బీజేపీ 52 నుంచి 63 వరకు, కాంగ్రెస్ 15 నుంచి 19 సీట్లు, ఇతరులు 12 సీట్లు గెలుచుకొనే అవకాశం ఉందనే విషయం స్పష్టమైంది.
6:52 PM, 21 Oct

హర్యానాలో News X సర్వే ప్రకారం

హర్యానాలో News X సర్వే ప్రకారం బీజేపీ 75-80, కాంగ్రెస్ 9-12, ఇతరులు 1-3 సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి స్పష్టమైన అధిక్యం కనిపిస్తున్నది.
6:37 PM, 21 Oct

టౌమ్స్ నై ఎగ్గిట్ పోల్స్: బీజేపీ కూటమి ఆధిక్యత

బీజేపీ, శివసేన కూటమికి స్పష్టమైన ఆధిక్యత.. బీజేపీకి 230 సీట్లు, కాంగ్రెస్‌కు 48 సీట్లు, ఇతరులు 10 సీట్లు సాధించే అవకాశం ఉందని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
6:33 PM, 21 Oct

ఇండియాటుడే సర్వే: మహారాష్ట్రలో బీజేపీ హవా

మహారాష్ట్రలో కమలం హవా.. ఇండియా టుడే సర్వే ప్రకారం బీజేపీ 166 నుంచి 194 వరకు, కాంగ్రెస్ 72 నుంచి 90 వరకు ఇతరులు 22 నుంచి 34 వరకు సీట్లు సాధించే అవకాశం ఉంది.
3:03 PM, 21 Oct

హర్యానాలో పార్టీల బలాాబలాలు

హర్యానాలోని 90 సీట్ల అసెంబ్లీలో అత్యధిక స్థానాలు గెలిచి అధికారంలోకి రావాలని ప్రణాళిక రచించింది. సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ 75 సీట్లను గెలుచుకోవడంపై దృష్టిపెట్టారు. గత ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో, కాంగ్రెస్ 17 స్థానాల్లో విజయం సాధించాయి.
3:02 PM, 21 Oct

గత ఎన్నికల్లో బీజేపీ గెలిచిన స్థానాలు

మహారాష్రలో జరిగిన గత ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 122 సీట్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ 42 సీట్లలో, ఎన్సీపీ 41 సీట్లలో విజయం సాధించాయి.
3:01 PM, 21 Oct

బీజేపీ, కాంగ్రెస్ పోటీ చేసిన సీట్ల వివరాలు

మహారాష్ట్రలో 288 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో బీజేపీ 150 సీట్లు, శివసేన 124 సీట్లలో పోటీ చేశాయి. ఇక సీట్ల ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ 125 సీట్లలో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 125 సీట్లలో పోటీ చేశాయి. బీజేపీ, శివసేన అలయెన్స్‌ను ధీటుగా ఎదురించేందుకు ప్రయత్నించింది.

English summary
Maharashtra, Haryana, Huzur Nagar of Telangana Elections exit results live coverage. One India telugu is going to present Exclusive election exit polls results in 17 states and 51 Assembly Election results along with prime Maharashtra and Harayna Assembly Elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X