Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏమడిగినా అదే జవాబు: పోలీసులకు హనీప్రీత్ చుక్కలు, ఎదురు ప్రశ్న

డేరా బాబా దత్త పుత్రిక హనీప్రీత్‌ను మంగళవారం అరెస్టు చేసిన పోలీసులు బుధవారం వేకువజాము వరకు విచారించారు. అనంతరం ఉదయం కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు అనుమతితో ఆమెను మళ్లీ ఆరు రోజుల కస్టడీకి తీసుకున్నా

Recommended Video

    Honeypreet Is In Six Days Police Remand By Panchkula Court On Wednesday | Oneindia Telugu

    ఢిల్లీ: డేరా బాబా దత్త పుత్రిక హనీప్రీత్‌ను మంగళవారం అరెస్టు చేసిన పోలీసులు బుధవారం వేకువజాము వరకు విచారించారు. అనంతరం ఉదయం కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు అనుమతితో ఆమెను మళ్లీ ఆరు రోజుల కస్టడీకి తీసుకున్నారు.

    పోలీసులకు చుక్కలు చూపుతున్న హనీప్రీత్

    పోలీసులకు చుక్కలు చూపుతున్న హనీప్రీత్

    అయితే, పోలీసులు అడిగిన ప్రశ్నలకు హనీప్రీత్ సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. ఆమె ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. తాను పోలీసులకు సహకరిస్తానని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతానని చెప్పింది. కానీ వారికి మాత్రం విచారణ సమయంలో చుక్కలు చూపిస్తోందని తెలుస్తోంది.

    హనీప్రీత్ నోరు విప్పడం లేదు

    హనీప్రీత్ నోరు విప్పడం లేదు

    డేరాతో, డేరా చీఫ్ గుర్మీత్ తో ఆమెకున్న సంబంధాలు, గుర్మీత్ కు శిక్షపడిన తరువాత జరిగిన విధ్వంసం వెనుక ఆమె హస్తం తదితరాలపై హర్యానా పోలీసులు ఎంతగా గుచ్చిగుచ్చి అడుగుతున్నా ఆమె నోరు విప్పడం లేదని అంటున్నారు.

    ఏమడిగినా 'నాకు తెలియదు, కాదు, లేదు'

    ఏమడిగినా 'నాకు తెలియదు, కాదు, లేదు'

    ప్రతి ప్రశ్నకూ హనీప్రీత్ నుంచి నాకు తెలియదు, లేదు, కాదు అన్న సమాధానాలే వస్తున్నాయని తెలుస్తోంది. బుధవారం సాయంత్రం నుంచి దాదాపు నాలుగైదు గంటల విచారించారు. తిరిగి గురువారం ఉదయం తిరిగి విచారణ ప్రారంభమైంది.

     దేశద్రోహం కేసుపై ఎదురు ప్రశ్న

    దేశద్రోహం కేసుపై ఎదురు ప్రశ్న

    హనీప్రీత్ విచారణకు సహకరించడం లేదని, తనపై ఆరోపణలు తప్పుడువని ఆమె చెబుతోందని పోలీసు అంటున్నారు. తనపై దేశద్రోహం కేసు ఎందుకు పెట్టారని హనీప్రీత్ ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. ఇక నిజాలను కక్కించేందుకు తమ వద్ద ఉన్న ఆధారాలను ఆమె ముందు ఉంచనున్నారని తెలుస్తోంది. విచారణ ప్రాంతంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+