Haryana Results 2024: సగం సీట్లలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధుల మధ్య తేడా 500 ఓట్లే..!
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎంత హోరాహోరీగా సాగాయో చూశాం. ఇవాళ వెలువడుతున్న వాటి ఫలితాలు కూడా అంతే ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధుల మధ్య ఓట్ల తేడా దాదాపు సగం సీట్లతో చాలా తక్కువగా ఉండటంతో విజేత ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ఉదయం తొలి రౌండ్ కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో కనిపించింది. ఆ తర్వాత బీజేపీ ఆధిక్యంలోకి వచ్చేసింది.
అయితే ఉదయం 9.45 గంటల కల్లా ఫలితాల సరళిని గమనిస్తే 40 సీట్లలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధుల ఆధిక్యాల్లో తేడా చూస్తే కేవలం 500 ఓట్ల లోపే ఉంది. దీన్ని బట్టి చూస్తే ఏ క్షణాన అయినా ఈ మెజార్టీలు మారిపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కూడా హర్యానాలో విజయంపై గట్టి ధీమాతో ఉన్నాయి. చివరి రౌండ్ కంటే ముందే తాము గెలిచి తీరుతామని కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హుడా ధీమా వ్యక్తం చేసారు.

గంట గంటకూ, రౌండ్ రౌండ్ కూ అభ్యర్ధుల ఆధిక్యాల్లో మార్పు కనిపిస్తుండటంతో హర్యానాలో పోటీ చేసిన వారితో పాటు అనుచరులు, పార్టీల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఆధిక్యాలు అతి స్వల్పంగా ఉండటంతో రాబోయే రౌండ్లు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఇంకా చెప్పాలంటే వందల ఓట్ల తేడాతో అభ్యర్ధులు గెలిచే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చివరి రౌండ్ వరకూ ఫలితాలను చెప్పలేమని ఫలితాలు చూస్తున్న వారు విశ్లేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications