Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2024 హ్యాట్రిక్‌కు ఇదే గ్యారంటీ: ప్రజలు వాటిని సహించరంటూ ప్రతిపక్షాలపై మోడీ విసుర్లు

న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అంతేగాక, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. అవినీతి, కుటుంబ రాజకీయాలను ప్రజలు సహించరని ప్రధాని మోడీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. 60 ఏళ్ల పాలనలో ఆదివాసీలను కాంగ్రెస్‌ పార్టీ పట్టించుకోలేదని ఆరోపించారు.

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన విజయోత్సవ సభకు ప్రధాని నరేంద్ర మోడీ సహా పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. మూడు రాష్ట్రాల గెలుపు గ్యారంటీతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని మోడీ ధీమా వ్యక్తం చేశారు.

Hat-trick In States Guarantee Of Hat-Trick In 2024: PM Modi After BJP winning in three states

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి అన్ని కులాలు, ప్రాంతాలు, వర్గాల ప్రజలు ఓటేశారని మోడీ తెలిపారు. పేపర్ లీక్, రిక్రూట్‌మెంట్ స్కామ్‌లపై యువతలో అసంతృప్తి రావడం వల్లే ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణలో ప్రభుత్వాలను గద్దె దింపారని విమర్శించారు. అవినీతి, కుటుంబ రాజకీయాలను ప్రజలు సహించరని అన్నారు. దేశంలోని యువత అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని, వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసినవారిని తరిమికొట్టారన్నారు ప్రధాని మోడీ. మహిళలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ 100 శాతం నెరవేరుస్తామని ప్రధాని మోడీ భరోసా ఇచ్చారు.

అంతకుముందు నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా ఆ రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ ప్రజలు సుపరిపాలన, అభివృద్ధిపైనే విశ్వాసం ఉంచుతారని మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడిచేస్తున్నాయని ట్విట్టర్ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. బీజేపీపై నమ్మకం ఉంచిన తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు, యువ ఓటర్లకు మోడీ తన కృతజ్ఞతలను తెలిపారు. మీ సంక్షేమం కోసం తాము చేస్తోన్న పనిని కొనసాగిస్తామని హమీ ఇచ్చారు. తెలంగాణతో తమ బంధం విడదీయరానిదని వెల్లడించారు. బీజేపీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మోడీ.

మరోవైపు, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో భారతీయ జనతా పార్టీ ఘన విజయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హర్షం వ్యక్తం చేశారు. బుజ్జగింపులు, కుల రాజకీయాల రోజులు ముగిసిపోయాయని ఇవాళ ఫలితాలు రుజువు చేశాయని అమిత్‌షా పేర్కొన్నారు. నవీన భారతం పనిచేసే ప్రభుత్వాలకే పట్టంకట్టిందని అమిత్ షా వ్యాఖ్యానించారు.

ప్రధాని మోడీపై ఉన్న విశ్వాసాన్ని ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజనులు, పేదలు, రైతు సోదర సోదరీమణులు ప్రదర్శించారని అమిత్‌ షా అన్నారు. బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించిన ఛత్తీస్‌గఢ్‌ ప్రజలకు ధన్యవాదాలంటూ ట్వీట్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ సంక్షేమ ఫలాలు, సుపరిపాలనకు మధ్యప్రదేశ్‌ ప్రజలు ఆమోదించి బీజేపీని ఆశీర్వదించారన్నారు. అటు రాజస్థాన్‌లో బీజేపీ జయకేతనం ఎగరవేయడంపై స్పందించిన అమిత్ షా.. బీజేపీకి అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన వీరభూమి రాజస్థాన్‌ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+