వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లీజ్, మమ్మల్ని వదిలేయండి, వేధించొద్దు: లోయ ఫ్యామిలీ ఉద్వేగం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మా తండ్రి మృతిపై మాకు ఎలాంటి అనుమానాలు లేవని, దీనిని రాజకీయం చేయవద్దని, దయచేసి తమను వదిలేయాలని సీబీఐ జడ్జి బీహెచ్ లోయ తనయుడు అంజు లోయా, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. తమను రాజకీయ బాధితులుగా చేయవద్దని, స్వప్రయోజనాల కోసం తమను లాగవద్దని కోరారు.

ఆయన కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు ఆదివారం మీడియా ఎదుట ఉద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి మృతిని రాజకీయం చేయకుండా సంయమనం పాటించాలని రాజకీయ పార్టీలకు మనవి చేస్తున్నానని లోయ తనయుడు అన్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలతో తమ కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైందన్నారు.

Have no suspicion on death, don't harass us, says Justice Loya son

దయచేసి తమను విచారించవద్దని లోయ తనయుడు అంజు లోయ అన్నారు. తన తండ్రి మృతిపై తొలుత తనకు అనుమానాలు ఉన్నప్పటికీ ఇప్పుడు తనకు ఎలాంటి అనుమానాలు లేవని చెప్పారు.

జస్టిస్ లోయ 2014 డిసెంబర్ 1న తన సహోద్యోగి కుమార్తె పెళ్లికి వెళ్లినప్పుడు గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో సోహ్రబుద్దీన్ షేక్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసును కూడా లోయా విచారణ జరుపుతున్నారు.

ఇటీవల నలుగురు సుప్రీం సీనియర్ న్యాయమూర్తులు సీజేఐ దీపక్ మిశ్రాపై అసంతృప్తి వ్యక్తం చేసిన సమయంలో మరోసారి జస్టిస్ లోయ మృతి అంశం తెరపైకి వచ్చింది. లోయా అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడంటూ సుప్రీం ముందుకు పిటిషన్ రావడం కూడా న్యాయమూర్తుల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తడానికి ఒక కారణమనే ప్రచారం ఉంది.

English summary
CBI judge B H Loya's family on Sunday said that they did not want to be victims of politicization and urged all parties to refrain from taking advantage of the situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X