మోదీ ఆ పదవి గ్యారెంటీగా ఇస్తారు, ఇప్పటికే 8 లక్షల గుండె ఆపరేషన్లు, మాజీ ప్రధాని హామీ!
లోక్‌సభ ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్న బీజేపీ, జేడీఎస్‌లు భారీ ప్రచారంలో నిమగ్నమైనాయి. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై సత్తా చాటేందుకు బీజేపీ, జేడీఎస్ కూటములు సిద్ధం అయ్యాయి. మండ్య నుంచి పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి గెలిచి కేంద్ర మంత్రి అవుతారనే ప్రచారం సాగుతోంది. కుమారస్వామి ఎంపీ అయితే కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని జేడీఎస్ నాయకులు అంటున్నారు.
అయితే ఇప్పుడు మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అల్లుడు, బెంగుళూరు రూరల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి డాక్టర్ సీఎన్ మంజునాథ్ ఎంపీగా విజయం సాదిస్తే ఆయన్ను కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా ఆసక్తిగా ఉన్నారని అన్నారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ వ్యాఖ్యలతో జేడీఎస్ నాయకులు షాక్ అయ్యారు.

కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు విశ్రమించేది లేదని మాజీ ప్రధాని దేవేగౌడ, మాజీ సీఎం కుమారస్వామి శపథం చేశారు. రామనగర జిల్లాలో డాక్టర్ మంజునాథ్‌కు ప్రచారం చేసిన మాజీ ప్రధాని దేవేగౌడ ఆయన్ను గెలిపించాలని ఓటర్లకు మనవి చేశారు. డాక్టర్ మంజునాథ్ తన వైద్య వృత్తిలో ఎనిమిది లక్షలకు పైగా గుండె ఆపరేషన్లు చేసి పేదలకు సహాయం చేశారని, అందుకే ఆయనను తమ మంత్రివర్గంలో చేర్చుకోవాలని జాతీయ నాయకులు ఆశపడుతున్నారని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు.
అందుకే తాను డాక్టర్ మంజునాథ్ కు ఓటు వేసి గెలిపించాలని మనవి చేస్తున్నానని, ఇక్కడి ప్రజలను తాను అదే కోరుతున్నానని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, అమిత్ షా చాలా రోజుల పాటు అన్నీ ఆలోచించి డాక్టర్ మంజునాథ్ బలాన్ని గుర్తించి ఆయనకు బెంగళూరు రూరల్ బీజేపీ టికెట్ ఇచ్చి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు. మంజునాథ్ సేవలు జాతీయ స్థాయిలో అవసరమని బీజేపీ నేతలు అంటున్నారని మాజీ ప్రధాని దేవేగౌడ విరించారు.
16 ఏళ్లుగా బెంగళూరులోని జయదేవ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ డైరెక్టర్‌గా డాక్టర్ మంజునాథ్ ఎంతో కృషి చేశారని, బీఎస్ యడ్యూరప్ప సీఎంగా ఉన్నప్పుడు జయదేవ్ లో డాక్టర్ మంజునాథ్ పదవీకాలాన్ని పొడిగించారని, ఆస్పత్రిలో పడక సామర్థ్యం పెంచడంలో మంజునాథ్ కష్టపడి పని చేశారని, అందువలన ఆయన రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ఇంకా సేవ చెయ్యడానికి అవకాశం ఉంటుందని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు.












Click it and Unblock the Notifications