రివాల్వర్ రాణి ట్విస్ట్: కిడ్నాప్ కాదు!, ప్రేమతోనే నా వెంట వచ్చాడు..

Subscribe to Oneindia Telugu

బుందేల్ ఖడ్: పెళ్లి మంటపంలోకి అడుగుపెట్టిన వర్షా అనే ఓ యువతి.. రివాల్వర్ తో వరుడిని బెదిరించి తనతో పాటు తీసుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. తుపాకీ గురిపెట్టి తనతో రావాల్సిందిగా రావడంతో.. వరుడు ఆమెను అనుసరించాడని వార్తలు వచ్చాయి.

అయితే తాను తుపాకీతో బెదిరించినట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని వర్షా పోలీసుల ఎదుట చెప్పింది. వరుడి తరుపువారు ఆమెపై కిడ్నాప్ కేసు పెట్టడంతో.. పోలీసులు ఆమెను పట్టుకున్నారు. తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, వరుడు అశోక్ తల్లిదంద్రులు అతనికి బలవంతంగా వివాహం చేస్తున్నారని, అందువల్లే తాను నేరుగా మంటపానికి వెళ్లి వరుడిని తీసుకొచ్చానని చెప్పుకొచ్చింది.

He Loves Me, Says 'Revolver Rani', Arrested For Kidnapping Groom

తమకు రహస్యంగా ఇదివరకే వివాహం జరిగిందని యువతి పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం తన తల్లి, సోదరితో పాటు కలిసి ఉంటున్న వర్షా.. పెళ్లికొడుకు తనంతట తానే వచ్చి కారులో కూర్చున్నాడని తెలిపింది. అశోక్ కు తానంటే చాలా ప్రేమ అని, అందువల్లే తనతో పాటు వచ్చాడని పేర్కొంది.

అశోక్ తల్లిదండ్రులు బలవంతంగా వివాహం చేయాలనుకున్నారని, ఆ వివాహం చేసుకునేందుకు అతను సిద్దంగా లేడని చెప్పింది. అశోక్ తో పెళ్లి నిశ్చయం చేసుకున్న కుటుంబానికి కూడా ఈ విషయం తెలుసని, కానీ తర్వాత అవే సర్దుకుపోతాయని భావించి పెళ్లి ఏర్పాట్లు చేశారని తెలియజేసింది. ఇదిలా ఉంటే, అశోక్ యాదవ్ ఆచూకీ మాత్రం ఇప్పటికీ తెలియలేదట!

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A young woman who kidnapped a groom at gunpoint from his wedding on Tuesday night - announcing, Bollywood-style, that she would not allow her man to marry someone else - has been arrested by the police in Uttar Pradesh's Bundelkhand. She claims the groom, Ashok Yadav, went with her willingly.
Please Wait while comments are loading...