శశిథరూర్‌ను వెంటనే పిచ్చాసుపత్రికి పంపండి, పాకిస్థాన్‌లో గర్ల్‌ఫ్రెండ్స్: సుబ్రమణ్య స్వామి ఫైర్
న్యూఢిల్లీ: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారత్ 'హిందూ పాకిస్థాన్'గా మారుతుందని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి తీవ్రంగా స్పందించారు. శశిథరూర్‌కు మతిభ్రమించినట్లుందని.. వెంటనే ఆయనకు వైద్యసాయం అందించాలని ప్రధాని నరేంద్ర మోడీకి సూచించారు.
Recommended Video

అవసరమైతే శశిథరూర్‌ను చికిత్స నిమిత్తం పిచ్చాసుపత్రికి తరలించాలని స్వామి వ్యాఖ్యానించారు. థరూర్ వ్యాఖ్యలు ఆయన అసహనానికి అద్దం పడుతున్నాయని అన్నారు. పాకిస్థాన్‌పై అసలు శశిథరూర్‌కు అంత ప్రేమ ఎందుకు అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీని అధికారం నుంచి తొలగించేందుకు సాయపడాలని పాకిస్థాన్ ప్రధానిని కూడా ఆయన కోరారని చెప్పారు.

శశిథరూర్‌కు పాకిస్థానీ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారని, వారంతా ఐఎస్ఐ మనుషులని సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. శశిథరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు.
కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కూడా శశిథరూర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నేతలకు భారత రాజ్యాంగం, భారత ప్రజలపై విశ్వాసం లేనందువల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా.. దాని వైఖరి మాత్రం ఇలాగే ఉంటుందని విమర్శించారు.












Click it and Unblock the Notifications