గుండె ఆగుతున్నా... 48 మంది ప్రాణాలు కాపాడాడు..
ఇటీవల ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. కారణం ఏదైనా వయస్సుతో సంబంధం లేకుండా పలువురు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఉన్నట్లుండి అకస్మాత్తుగా ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. ఇలా అకాల మరణాలతో వారి కుటుంబాలలో అంతులేని విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. తాజాగా ఓ బస్సు డ్రైవర్ గుండెపోటుకు గురైన బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా కాపాడి హీరో అయ్యాడు. బస్సు రన్నింగ్‌లోనే ఉండగా గుండెపోటుకు గురైనా డ్రైవర్ మరింత దూరం బస్సును నడపలేడని ముందుగానే గ్రహించి, ఎంతో చాకచక్యంగా బస్సును రోడ్డుపక్కనే ఉన్నగోడకు ఢీకొట్టాడు. దీంతో బస్సు గోడకు ఢీకొని నిలిచిపోయింది. ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.
ఒడిశాలోని ఉదయపురి సమీపంలో : ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఒడిశాలోని ఉదయపురి సమీపంలో ఓ ప్రయివేట్ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. విపరీతమైన నొప్పి వచ్చినా.. వేగంగా ఉన్న బస్సును కంట్రోల్ చేసి, ఓ గోడను ఢీకొట్టాడు. దీంతో బస్సులోని 48 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆ బస్సు డ్రైవర్‌పై సనా ప్రధాన్. అయితే ఈ ఘటన భువనేశ్వర్ నగరానికి వెళుతుండగా మార్గం మధ్యలో జరిగింది. ఒక్కసారిగా బస్సు డ్రైవర్‌కు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో డ్రైవర్ ఎంతో తెలివిగా బస్సును గోడకు ఢీకొట్టాడు.

దీంతో బస్సు గోడకు ఢీకొని ఆగిపోయింది. వెంటనే బస్సులో ఉన్న 48 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో వెంటనే ఆ డ్రైవర్‌ణు సనా ప్రధాన్ సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, గుండె ఆగిపోవడంతో అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత మరో డ్రైవర్ బస్సులోని ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చారు. డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పోలీసులు వివరించారు.
మా లక్ష్మీ ప్రైవేట్ బస్సు : ఈ సందర్భంగా టికాబలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఇన్స్పెక్టర్ కళ్యాణమయి సేంద మాట్లాడుతూ.. గుండెనొప్పి రావడంతో డ్రైవర్ మరింత దూరం బస్సును నడపలేడని గ్రహించి, డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఉన్న గోడకు ఢీకొట్టాడని, అందుకే ప్రయాణికులంతా క్షేమంగా బయటికి రాగలిగారని అన్నారు. మా లక్ష్మీ ప్రైవేట్ బస్సు సాధారణంగా కంధమాల్‌లోని సారన్‌ఘర్ నుంచి జి ఉదయగిరి మీదుగా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు ప్రతి రాత్రి ప్రయాణం చేస్తుందని ఎస్ఐ చెప్పారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications