అప్పు చేసి మరీ ఎన్నికల్లో పోటీచేశాడు... చివరికి గెలిచాడు..
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవగా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ విజయ ఢంకా మోగించింది. ఈ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కొందరు సాధారణ అభ్యర్థులు సైతం వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం ఓ వ్యక్తి ఏకంగా అప్పు చేసి మరీ ఎన్నికల్లో పోటీచేశాడు. చివరకు తను అనుకున్న లక్ష్యాన్నీ సొంతం చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన కమలేశ్వర్ దొడియార్ అప్పు చేసి మరీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. సాధారణ ప్రజలు రాజకీయానాయకులుగా ఎదగాలన్నా, పోటీచేయాలన్న డబ్బు ఉండాలి. అదే పరిస్థితి కమలేశ్వర్‌కు కూడా ఎదురయ్యింది. ఎన్నికల్లో ఎలాగైనా పోటీచేయాలి. కానీ, పోటీచేయాలంటే ఎంతో కొంత డబ్బు ఉండాలి. ఏం చేయాలో తెలియక కమలేశ్వర్ ఏకంగా 12 లక్షల రూపాయలను అప్పు చేసి మరీ ఎన్నికల్లో పోటీచేశాడు. భారీ విజయాన్ని అందుకుని తన అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు.

71219 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు..
33 ఏళ్ల కమలేశ్వర్ భరత్ ఆదివాసీ పార్టీ నుండి గెలుపొందారు. కమలేశ్వర్ ఓ నిరుపేద వ్యక్తి. అతను కుటుంబంతో కలిసి ఒక గుడిసెలో నివసిస్తుంటాడు. కమలేశ్వర్ కూలీ కుటుంబంలో పెరిగిన వ్యక్తి. అతని తల్లి సీతాబాయి ఇప్పటికే కూలీ పనిచేస్తూనే ఉన్నారు. ఆరుగురు సోదరులు, ముగ్గురు సోదరిమణులలో కమలేశ్వర్ ఆఖరివాడు. పేదరికంలోనుంచి వచ్చిన వ్యక్తి కమలేశ్వర్. ఆదివారం వెలువడిన ఫలితాలలో కమలేశ్వర్‌ను విజయం వరించగా అతన్నీ అభినందించేందుక గ్రామస్థులు తరలివచ్చారు. సైలానా స్థానం నుంచి కమలేశ్వర్ పోటీచేసి 71219 ఓట్లతో విజయం సాధించాడు. కాంగ్రెస్ అభ్యర్థి హర్ష్ విజయ్ గెహ్లాట్ 66601 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో బీజేపీ మూడో స్థానంలో ఉండిపోయింది. రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు ఈ స్థానంలో పోలవ్వడం విశేషం. ఇక్కడ 90.08 శాతం ఓటింగ్ జరిగింది.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications