భయానకంగా వ్యాపిస్తున్నా.. బాధ్యత లేకుండా: సెల్‌ఫోన్‌లో చిట్‌చాట్: రైల్వేస్టేషన్‌లో థర్మల్ స్క్రీనింగ

బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ మనదేశంలో ఏ రేంజ్‌లో చెలరేగిపోతోందనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేని పరిస్థితి నెలకొని ఉంది. దేశవ్యాప్తంగా 270కి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి. జనసమ్మర్థంతో ఉండే విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లలో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తోంది.

ఇంతటి కీలకమైన థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్లక్ష్యంగా తీసుకుంటే.. దాని పరిణామాలు భయంకరంగా ఉంటాయి. ఈ విషయం తెలిసినప్పటికీ.. ఏ మాత్రం పట్టింపు లేకుండా ప్రవర్తించాడో వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగి. ఆయన పేరు నరసింహ మూర్తి. రైల్వేస్టేషన్‌లో కూర్చీలో కూర్చుని.. సెల్‌ఫోన్‌లో బాతాఖాని కొడుతూ సీటు నుంచి లెవ్వకుండా థర్మల్ పరీక్షలను నిర్వహించారు. కర్ణాటకలోని తుమకూరు రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది ఈ ఘటన.

Health staff suspended for neglecting thermal scanning at Tumkur railway station

దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో కాస్తా వెలుగులోకి వచ్చిన వెంటనే కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. నరసింహ మూర్తిపై సస్పెన్షన్ వేటు వేసింది. వివిధ ప్రాంతాల నుంచి రైళ్ల ద్వారా గమ్యస్థానాలకు చేరుకునే వారిలో కరోనా వైరస్ సోకిందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రైల్వేస్టేషన్లలో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో వాటిని చేపట్టింది.

కీలకమైన ఈ థర్మల్ స్క్రీనింగ్ పరీక్షల సందర్భంగా ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. కఠిన చర్యలను తీసుకుంటామని ముందే హెచ్చరికలను జారీ చేసింది. అయినప్పటికీ.. వాటిని పట్టించుకోలేదా నరసింహమూర్తి. తన మానాన తాను కూర్చీలో కూర్చుని, సెల్‌ఫోన్‌లో చిట్‌చాట్ చేస్తూ, స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తోన్న వీడియో ఒకటి సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. దీన్ని కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. నరసింహ మూర్తిని సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని కర్ణాటక వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి బీఎస్ శ్రీరాములు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+