రిసార్ట్ లో ఎంజాయ్ చేస్తారు, స్పీకర్ నోటీసులకు మాత్రం, సీఎంను మర్చాలి, తిరుబాటు కాదు!

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారని ఆరోపిస్తూ 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మీద అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ చట్ట వ్యతిరేకంగా వేటు వేశారని, ఆయన నిర్ణయం సరైంది కాదని టీటీవీ దినకరన్ న్యాయవాది దుష్యంత్ దవే మద్రాస్ హైకోర్టులో చెప్పారు.

మంగళవారం మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తి దొరైసామి ముందు దినకరన్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన పన్నీర్ సెల్వం, ఆయనకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేల మీద స్పీకర్ ధనపాల్ ఆ రోజు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని దినకరన్ న్యాయవాది ప్రశ్నించారు.

Hearing on disqualification TN MLAs starts at Chennai High Court

అనర్హతకు గురైన 18 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం, అన్నాడీఎంకే పార్టీ మీద తిరుగుబాటు చెయ్యలేదని దినకరన్ తరపు న్యాయవాది దుష్యంత్ దవే కోర్టులో చెప్పారు. 18 మంది ఎమ్మెల్యేలు కేవలం ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి నాయకత్వాన్ని వ్యతిరేకించారని, గవర్నర్ కు ఇచ్చిన లేఖలో అదే ఉందని వివరించారు.

మూడు వారల్లో వెంట వెంటనే నోటీసులు ఇచ్చిన స్పీకర్ ధనపాల్ 18 మంది ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వకుండా అనర్హత వేటు వేశారని దినకరన్ న్యాయవాది ఆరోపించారు. మూడు వారాలు సమయం ఇచ్చినా, నోటీసులకు సమాధానం ఇవ్వాలన్నా 18 మంది ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని స్పీకర్ న్యాయవాది అరిమ సుందరం కోర్టులో చెప్పారు.

పుదుచ్చేరి, కొడుగు రిసార్ట్ ల్లో రెబల్ ఎమ్మెల్యేలు ఎంజాయ్ చెయ్యడానికి సమయం ఉంటుంది కాని స్పీకర్ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చే టైం ఉండదా అని స్పీకర్ న్యాయవాది అరిమ సుందరం దినకరన్ న్యాయవాదిని దుష్యంత్ దవేని సూటిగా ప్రశ్నించారు. మద్రాసు హైకోర్టులో తారా స్థాయిలో ఇరువర్గాల న్యాయవాదులు వాదిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+