హృదయ విదారకం: కరోనా సోకిన భర్తకు నోటి ద్వారా శ్వాస అందించిన భార్య, అయినా విషాదమే
ఆగ్రా: కరోనా మహమ్మారి అనేక కుటుంబాల్లో విషాదం నింపుతోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో ఎన్నో హృదయవిదారక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కరోనాతో బాధపడుతున్న తన భర్తకు శ్వాస అందకపోవడంతో ఓ మహిళ తన నోటి ద్వారా అతనికి శ్వాస అందించే ప్రయత్నం చేసింది. అయినా ఆమె ప్రయత్నం ఫలించలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెలితే.. ఆగ్రాలోని అవాస్ వికాస్ సెక్టార్ 7లో రవి సింఘాల్(47) -రేణు సింఘాల్ కుటుంబం నివాసం ఉంటోంది. కరోనా బారినపడిన రవి సింఘాల్‌ను అతని భార్య రేణు ఆటోలో సరోజినీ నాయుడు మెడికల్ కాలేజీ(ఎస్ఎన్ఎంసీ) ఆస్పత్రికి ఆటోలో తీసుకెళ్లింది.

శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్న భర్తను చూడలేక రేణు సింఘాల్ నోటి ద్వారా అతనికి శ్వాసను అందించే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ అతడు ఆస్పత్రికి చేరుకునే సమయానికి ప్రాణాలు కోల్పోయాడు. రేణు సింఘాల్ నోటి ద్వారా శాస అందిస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ఆక్సిజన్ కొరత కారణంగా పలువురు కరోనా రోగులు ఇప్పటికే మృత్యువాత పడుతున్నారు. ఆగ్రాలోనూ పలువురు మృతి చెందారు. భారీ సంఖ్యలో పెరుగుతున్న కరోనా రోగులకు సరిపడా ఆక్సిజన్ లభ్యం కావడం లేదు. దీంతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.
కాగా, గత వారం రోజుల్లోనే ఇండియాలో 22.5 లక్షల కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. అదే సమయంలో 89శాతం మరణాల రేటు పెరిగింది. ఇది ప్రపంచంలోనే చాలా తీవ్రమైన పరిస్థితి కావడం గమనార్హం. ఆదివారం కూడా 3.55 లక్షల కేసులు నమోదు కావడం, 2807 మరణాలు సంభవించడం గమనార్హం. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇప్పటి వరకు ఈ స్థాయిలో కేసులు, మరణాలు నమోదుకాలేదు.












Click it and Unblock the Notifications