దంచి కొడుతున్న వర్షాలు- ఉక్కపోత నుంచి ఊరట
తిరువనంతపురం: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాకలో జాప్యం ఏర్పడింది. సాధారణంగా ప్రతి సీజన్‌లోనూ జూన్ 1వ తేదీ నాటికి క్రమం తప్పకుండా కేరళ వద్ద తీరాన్ని తాకుతుంటాయి నైరుతి రుతుపవనాలు. నాలుగైదు రోజుల్లోనే విస్తరిస్తుంటాయి. ఈ సారి మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాల రాకలో తీవ్ర జాప్యం ఏర్పడింది.
అయిదు సంవత్సరాల్లో నమోదైన నైరుతి రుతు పవనాల కదలికలను పరిగణనలోకి తీసుకుంటే- 2018లో మే 29, 2019లో జూన్ 8, 2010లో జూన్ 1, 2022లో జూన్ 3వ తేదీన అవి కేరళ తీరాన్ని తాకాయి. ఇప్పుడు- 5వ తేదీ వచ్చిన వాటి జాడ కనిపించట్లేదు. భారత వాతావరణ కేంద్రం ముందుగా వేసిన అంచనాల ప్రకారం.. ఈ నెల 4వ తేదీ అంటే ఆదివారం నాటికే రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకాల్సి ఉంది. ఈ అంచనా కూడా తప్పింది.

ఇప్పుడు రుతు పవనాలపై తాజా అప్‌డేట్ ఇచ్చింది వాతావరణ కేంద్రం. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వెల్లడించింది. రుతుపవనాల కదలికలకు అనుకూల వాతావరణం నెలకొని ఉందని పేర్కొంది. అరేబియా సముద్రం ఆగ్నేయ ప్రాంతం, లక్షద్వీప్, కేరళ తీరంలోని అనేక ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు అలముకున్నాయని, పశ్చిమం నుంచి ఈదురుగాలులు వీస్తోన్నాయని వివరించింది.
అలాగే- అరేబియా సముద్రం దక్షిణం వైపు నుంచి పడమటి దిశగా గాలులు వీయడం, ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు పశ్చిమ వైపు నుంచి గాలులు వీస్తోండటం వల్ల నైరుతి రుతుపవనాలు పురోగమించడానికి దోహదం చేస్తోన్నాయిన వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ 48 గంటల వ్యవధిలో అరేబియా సముద్రం ఆగ్నేయ ప్రాంతంతో పాటు లక్షద్వీప్, కేరళ తీరంలో మేఘాలు మరింత దట్టంగా అలముకునే అవకాశం లేకపోలేదని తెలిపింది.

రుతు పవనాల ఆగమన ప్రభావం అప్పుడే మొదలైంది కూడా. రాజధాని తిరువనంతపురం సహా పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. సాయంత్రం 7 గంటల నుంచి ఏకధాటిగా తిరువనంతపురంలో వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. వచ్చే 48 గంటల్లో వర్షాల తీవ్రత మరింత ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
-
బిల్ గేట్స్ వర్షాలను కంట్రోల్ చేస్తున్నారా? 'వార్' ఆన్ వెదర్! -
కొత్త వైరస్ మరణ మృదంగం: ‘షిగెల్లా’ సోకి మూడేళ్ల చిన్నారి బలి.. -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్












Click it and Unblock the Notifications