20 జిల్లాల్లో రెడ్ అలర్ట్..8 ప్లైట్స్ రద్దు.. తమిళనాడులో వర్ష బీభత్సం

తమిళనాడులో వర్ష బీభత్సం కొనసాగుతుంది. బుధవారం చెన్నై, చెంగల్ పెట్, తిరువల్లూరు, కాంచీపురం, విల్లుపురంలో భారీ వర్షం కురిసింది. మరో రెండు రోజులు వాన పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. రేపు దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు గుండా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది.

 Heavy rain continues to lash Tamil Nadu

తమిళనాడు దక్షిణ జిల్లాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. రాత్రి 8 గంటల తర్వాత వర్ష బీభత్సం కొనసాగింది. కరైకల్, శ్రీహరికోట మీదుగా తుపాన్ దాటనుంది. గురువారం సాయంత్రం.. దాటడంతో క్రమంగా బలహీనపడనుంది. గురు, శుక్రవారాల్లో వర్షం ఎక్కువగానే కురవనుంది. చెన్నైలో 250 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువగా వర్షం కురుస్తోందని చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గగన్ దీప్ తెలిపారు. మరోవైపు 20 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేశారు. ఇందులో చెన్నై కూడా ఉంది. తూతుకుడి, విల్లీపురం, తిరునెల్వెల్లీ, నాగపట్నం, కడలూరు, చెంగల్ పట్టులో వర్షం ఎక్కువగానే కురవనుంది. వర్ష ప్రభావంతో గురువారం చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్ పెట్, కడలూరు, నాగపట్నం, తాంజావూర్, తిరువరూర్, మయిలడుతురై జిల్లాలో స్కూళ్లకు సెలవు ఇచ్చారు. మరోవైపు చెన్నై వచ్చే విమానాలను రద్దు చేశారు. వాతావరణ సమస్య వల్ల క్యాన్సిల్ చేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బుధ, గురు, శుక్ర వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని..లోతట్టు ప్రాంతాలను, నీట మునిగే ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. తుపాను సమయంలో ప్రజలు త్రాగునీటికి ఇబ్బందిపడకుండా చూడాలని సూచించారు.

పంట చేతికి వచ్చే సమయంలో కురుస్తోన్న వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వరి పంట చేతికి వచ్చింది. వర్షాలు పడటంతో.. నీటితో తడిగా ఉంటుంది. దీంతో మిషన్ల ద్వారా కోత మరింత కష్టం అవుతుంది. వరుణ దేవ తమను కరుణించు అని అన్నదాతలు వేడుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+