ఢిల్లీలో దంచికొట్టిన వాన.. 19 ఏళ్ల తర్వాత ఇలా...
ఢిల్లీకి రుతుపవనాలు ఆలస్యంగా చేరినా.. వర్షాలు మాత్రం దంచికొడుతున్నాయి. జూలైలో ఇప్పటివరకు 381 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2003 తర్వాత జూలైలో ఇదే అధిక వర్షాపాతం అని ఐఎండీ అధికారులు తెలిపారు. సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ పరిధిలో మూడు గంటల్లోనే వంద మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందని పేర్కొంది.
2013, జూలై 21న 123.4 మిల్లీమీటర్ల వర్షాపాతం కురిసింది. 19 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ సారి దేశ రాజధానికి రుతుపవనాలు 16 రోజులు ఆలస్యంగా చేరాయి. ఈ నెలలో 14 రోజులు వర్షాలు కురిశాయి. భారీ వానలకు ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ పరిధిలో ఈ నెల 27 వరకు 108 శాతం అధిక వర్షపాతం రికార్డయింది. సాధారణ వర్షాపాతం 183.5 మిల్లీమీటర్లు. 2003లో ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో 632.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

గకొద్ది సంవత్సరాలుగా వర్షం కురిసే రోజుల సంఖ్య తగ్గిందని స్కైమెట్ వెదర్ వైస్ ప్రెసిడెంట్ మహేశ్ షలావత్ పేర్కొన్నారు. నగరాల్లో తక్కువ వ్యవధిలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వివరించారు. ఇంతకుముందు మూడు, నాలుగు రోజుల్లో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయితే.. ప్రస్తుతం ఐదారు గంటల్లో రికార్డ అవుతుందన్నారు. ఈ వర్షాలతో భూగర్భ జలాలు పెరుగవని, వర్షపాతం నెమ్మదిగా ఉంటే భూమిలోకి నీరు ఇంకే అవకాశం ఉంటుందన్నారు.
ఉత్తరాదిలో వర్షబీభత్సం కొనసాగుతోంది. కొండచరియలు విరిగిపడుతున్నాయి. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. జనానికి ఇబ్బందులు తప్పడం లేదు
-
AAHAR 2026: మార్చి 10 నుంచి ఢిల్లీలో భారీ ఫుడ్ ఎగ్జిబిషన్..!! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!!












Click it and Unblock the Notifications