Viral Video: సినీ ఫక్కీలో భారత నౌక సీజ్-ఫుటేజ్ రిలీజ్ చేసిన ఇరాన్..!
అమెరికా-ఇరాన్ వార్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు సీజ్ పైర్ అంటూనే హార్ముజ్ జలసంధిలో ఇరాన్ పోర్టుల నుంచి వచ్చే నౌకల్ని అడ్డుకుంటున్న అమెరికాకు కౌంటర్ గా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) కూడా నౌకల్ని టార్గెట్ చేయడం ప్రారంభించింది. ఇందులో భారత్ లోని గుజరాత్ కు వెళ్తున్న ఎపమినోండాస్ అనే నౌకతో పాటు ఎంఎంస్సీ ఫ్రాన్సెస్కా అనే మరో నౌకపైనా దాడి చేసి తమ తీరంలోకి తీసుకెళ్లిపోయింది. ఇవాళ ఆ నౌకల సీజ్ ఫుటేజ్ (viral video) కూడా రిలీజ్ చేసింది.
ఈ వీడియోలో ఇరాన్ జెండాలున్న స్పీడ్‌బోట్లు ఆ నౌకలను సమీపించడం, ఆ తర్వాత ముఖానికి మాస్కులు ధరించిన సైనికులు రైఫిళ్లు చేతబట్టుకుని నౌకలపైకి ఎక్కడం కనిపిస్తోంది. ఇరాన్ సాయుధ దళాల హెచ్చరికలను పట్టించుకోనందున ఐఆర్జీసీ గార్డులు కేవలం ఎపమినోండాస్‌పై మాత్రమే కాల్పులు జరిపారు. తర్వాత యూఫోరియా అనే రెండవ నౌకపై కూడా కాల్పులు జరిపారు, ఆ తర్వాత అది ఆగిపోయింది, మూడవ నౌక అయిన ఎంఎస్‌సి ఫ్రాన్సెస్కాను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు వారు తెలిపారు.

🇮🇷⚡️BREAKING: IRGC releases footage showing their Navy forces seizing the 'MSC Epaminondas' vessel in the Strait of Hormuz earlier today. pic.twitter.com/Mx8Jt6QIAB
— IRGC (@IRGC_Press) April 22, 2026
హార్ముజ్ జలసంధిలో ఇస్లామిక్ రిపబ్లిక్ విధించిన నిబంధనలను ధిక్కరిస్తూ ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని, అలాగే ఆ జలమార్గం గుండా సురక్షిత ప్రయాణానికి విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడవద్దని గార్డ్స్ హెచ్చరించారు. హార్ముజ్ జలసంధిలో శాంతిభద్రతలకు భంగం కలిగించడం ఇరాన్‌కు ఒక రెడ్ లైన్‌గా పరిగణిస్తామని IRGC హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలిక కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగిస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటలకే ఈ నౌకల సీజ్ జరిగింది. ఈ పరిణామం ట్రంప్ కు షాకిచ్చింది. అయినా ఏమీ చేయలేని పరిస్ధితుల్లో ఆయన ఉన్నారని అర్దమవుతోంది.












Click it and Unblock the Notifications