వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో ఆ ఐదునెలలు భారీవాహనాలు, ట్రక్కులపై నిషేధం.. మండిపడుతున్న వాణిజ్యసంఘాలు!!

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. ఈ క్రమంలో కాలుష్యాన్ని అరికట్టే ప్రయత్నంలో భాగంగా అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు దేశ రాజధానిలో ట్రక్కులు మరియు ఇతర మధ్యస్థ మరియు భారీ వాహనాల ప్రవేశాన్ని ఢిల్లీ ప్రభుత్వం గురువారం నిషేధించింది.

అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు ఢిల్లీలో ఆ వాహనాలు నిషేధం

అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు ఢిల్లీలో ఆ వాహనాలు నిషేధం

అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు ఎలాంటి ట్రక్కులను నగరంలోకి అనుమతించబోమని ఢిల్లీ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణంగా, రాష్ట్రం నవంబర్ లేదా డిసెంబర్‌లలో 15-20 రోజులు మాత్రమే ట్రక్కులు మరియు మినీ టెంపోల వంటి వాహనాల ప్రవేశాన్ని నిషేధిస్తుంది. కానీ ఈ సారి ఏకంగా ఐదు నెలల పాటు నిషేధం విధించింది. గత కొన్ని సంవత్సరాల నుంచి చలికాలంలో ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా పడిపోతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

కాలుష్యం తగ్గించటం కోసం ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం

కాలుష్యం తగ్గించటం కోసం ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం

నివేదికల ప్రకారం, దాదాపు 70,000 నుండి 80,000 ట్రక్కులు ఈ సీజన్లో ఢిల్లీలోకి ప్రవేశిస్తున్నాయి. నగరంలోకి అనుమతించబడే వాహనాలలో సీఎన్జీ తో నడిచే వాణిజ్య వాహనాలు ఉన్నాయి . కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, గుడ్లు, మంచు, పాలు మరియు ఇతర ఆహార పదార్థాలు వంటి అవసరమైన వస్తువులను తీసుకువెళ్లే అన్ని ట్రక్కులు, మరియు పెట్రోలియం ఉత్పత్తులను రవాణా చేసే ట్యాంకర్లు ఢిల్లీ లోకి వస్తున్నాయి . అయితే గాలి కాలుష్యాన్ని తగ్గించడం కోసమే భారీ వాహనాలు ట్రక్కుల పై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ సర్కారు ప్రకటించింది.

అక్టోబర్ నుండి అమలు కానున్న భారీ వాహనాలు, ట్రక్కుల నిషేధం

అక్టోబర్ నుండి అమలు కానున్న భారీ వాహనాలు, ట్రక్కుల నిషేధం

హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలోని ఈ పారిశ్రామిక వాడల నుంచి విడుదలవుతున్న కర్బన ఉద్గారాలు, పంటల చెత్తను కాల్చడం ద్వారా వస్తున్న కాలుష్య కారకాలను తగ్గించడం కోసం చర్యలు చేపట్టిన ఢిల్లీ ప్రభుత్వం, వాహనాల వల్ల పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నివారించడానికి ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక ఈ నిర్ణయం ఈ ఏడాది అక్టోబర్ నుండి 2023 ఫిబ్రవరి వరకు అమలు కానుంది.

ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్, వ్యాపార సంఘాలు

ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్, వ్యాపార సంఘాలు

ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను ట్రక్కులు మరియు వాణిజ్య వాహనాల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కోట్ల విలువైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో నెలల తరబడి నిషేధం విధించడం వల్ల వ్యాపారంపై ప్రభావం పడుతుందని ఆల్ ఇండియా మోటార్ అండ్ గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ పేర్కొంటుంది. ఈ నిర్ణయం వల్ల వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని కూడా ప్రభావితం చేస్తుందని వారు చెబుతున్నారు.

డీజిల్ వాహనాల తయారీనే బ్యాన్ చెయ్యాలని ఆగ్రహం

డీజిల్ వాహనాల తయారీనే బ్యాన్ చెయ్యాలని ఆగ్రహం


ఆహారం, కూరగాయలు మరియు ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయని వారంటున్నారు. ట్రక్కులకు మాత్రమే నిషేధం ఎందుకు? ఢిల్లీలో ఇతర డీజిల్ వాహనాలను ఎందుకు నిషేధించరు, డీజిల్ ఒక ప్రముఖ కాలుష్యకారకమైతే, డీజిల్ వాహనాల తయారీని నిషేధించాలని వారు చెబుతున్నారు. కాలుష్యాన్ని నివారించడానికి ఇది పరిష్కారం కాదని వారు మండిపడుతున్నారు. రాజధాని యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఇటీవలి సంవత్సరాలలో శీతాకాలంలో చాలా తక్కువ స్థాయికి పడిపోయింది. కాలుష్య కారకాలు 2.5 లేదా PM2.5 స్థాయిలు శీతాకాలంలో గణనీయంగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ నుండి భారీ వాహనాలు, ట్రక్కుల పై నిషేధం విధించి పొల్యూషన్ తగ్గించే ప్రయత్నం చేస్తుంది ఢిల్లీ సర్కార్.

English summary
The Delhi government has taken a key decision to control pollution. Delhi has imposed a five-month ban on heavy vehicles and trucks from October to February next year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X