ముగిసిన హీరాబెన్ మోడీ అంత్యక్రియలు: పాడె మోసి, చితికి నిప్పంటించిన ప్రధాని మోడీ!!

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోడీ పరమపదించారు. వంద సంవత్సరాల వయసులో, వయసుతోపాటు వచ్చే అనారోగ్యం కారణంగా హీరాబెన్ మోడీ మృతిచెందారు. హీరాబెన్ మోడీ మృతితో దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోడీ తల్లి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

తల్లి పాడె మోసి... చితికి నిప్పంటించిన ప్రధాని మోడీ

తల్లి పాడె మోసి... చితికి నిప్పంటించిన ప్రధాని మోడీ


100 ఏళ్ళ వయసులో ప్రధాని మోడీ తల్లి కన్నుమూసారు. ప్రధాని మోడీ మాతృమూర్తి హీరాబెన్ అంత్యక్రియలు గుజరాత్ లోని గాంధీనగర్ లో మోడీ కుటుంబసభ్యుల బాధాతప్త నివాళులతో ముగిశాయి. ప్రధాని మోడీ ఈరోజు నిర్వహించిన అంత్యక్రియలలో తన తల్లి పాడెను మోశారు. అనంతరం నిర్వహించిన క్రతువులో భాగంగా తల్లి చితికి నిప్పంటించారు. ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మోడీ అంతిమ సంస్కారానికి మోడీ కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు.రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లోని సెక్టార్ 30లోని ముక్తిధామ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

తల్లిని ఉద్దేశించి మోడీ భావోద్వేగ ట్వీట్

ఇదే సమయంలో మోడీ తన తల్లిని ఉద్దేశించి భావోద్వేగ ట్వీట్ చేశారు. వందేళ్లు పూర్తి చేసుకున్న ఒక మహిమాన్వితమైన వ్యక్తి ఈశ్వరుడి పాదాల చెంతకు చేరిందన్నారు. అమ్మలో తనకి ఎప్పుడూ త్రిమూర్తులను చూసిన అనుభూతి కలుగుతుందన్నారు. ఆమె జీవితం ఒక తపస్సు లాంటిది. సన్యాసినిలా, కర్మయోగిలా, విలువలకు కట్టుబడిన వ్యక్తిలా అమ్మ నిస్వార్థ జీవితాన్ని గడిపారు అంటూ మోడీ తన తల్లి గొప్పతనాన్ని తెలియజేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. తల్లి మృతితో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

హీరాబెన్ మృతితో స్థానికంగా బంద్ నిర్ణయం.. పని చేసుకోవాలని మోడీ ఫ్యామిలీ సూచన

హీరాబెన్ మృతితో స్థానికంగా బంద్ నిర్ణయం.. పని చేసుకోవాలని మోడీ ఫ్యామిలీ సూచన

ప్రధాని నరేంద్ర మోడీకి తన తల్లి పట్ల ఎంతో ప్రేమ ఉంది. ఈ కారణంగానే తన తల్లితో తనకు ఉన్న అనుబంధాన్ని ప్రధాని మోడీ పంచుకున్నారు. ప్రధాని స్వస్థలమైన వాద్‌నగర్‌లో నేడు బంద్‌ పాటించాలని స్థానికులు నిర్ణయించగా హీరాబెన్ మోడీ కుటుంబం అందరూ పని చేసుకోవాలని, అదే హీరాబెన్ కు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

నేడు పశ్చిమ బెంగాల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్ గా ప్రారంభించనున్న మోడీ

నేడు పశ్చిమ బెంగాల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్ గా ప్రారంభించనున్న మోడీ

ప్రధాని మోడీ తన తల్లి మృతితో నిర్వహించాల్సిన పలు కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేడు నిర్వహించనున్నారు. ఇక ఇదే విషయాన్ని అధికారులు ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పీఎంవో కార్యాలయం తెలియజేసింది . నేడు ఒక రోజు పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్రమోడీ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కీలకమైన ప్రాజెక్టుల ప్రారంభం, జాతీయ గంగా కౌన్సిల్ సమావేశం లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనాల్సి ఉంది. 7,800 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయాల్సి ఉంది. అయితే ఆ కార్యక్రమాలలో నేడు ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్నారు.

హీరాబెన్ మృతిపట్ల సంతాపం తెలిపిన రాహుల్ గాంధీ


ఇక ప్రధాని నరేంద్రమోడీ తల్లి మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఒక ట్వీట్ లో ఆయన, "ప్రధాని నరేంద్ర మోడీ తల్లి శ్రీమతి హీరాబెన్ మృతి వార్త చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో నేను ప్రధాని మోడీ కి, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఆ కుటుంబం పై తమ ప్రేమ ఎప్పటికీ ఉంటుందని వెల్లడించారు.

తెలంగాణా సీఎం కేసీఆర్, హారీష్ రావు, చిరంజీవి సంతాపం

తెలంగాణా సీఎం కేసీఆర్, హారీష్ రావు, చిరంజీవి సంతాపం


ఇక హీరాబెన్ మోడీ మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, హరీష్ రావు తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి మోడీ తల్లి హీరాబెన్ మృతిపట్ల స్పందించారు ఆమె అసాధారణమైన జీవితాన్ని గడిపారని, స్వర్గలోకానికి బయల్దేరిన ఆమె దివ్య ఆత్మకు నా నివాళులు అంటూ చిరంజీవి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా అనేక రాజకీయ ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు ప్రతి ఒక్కరూ ప్రధాన నరేంద్ర మోడీ తల్లి మృతితో తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+