బంగాళాఖాతంలో కుప్పకూలిన ఎయిర్ క్రాఫ్ట్
దేశంలో మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అండమాన్ పోర్ట్ బ్లెయిర్ నుంచి టేకాఫ్ అయిన పవన్ హన్స్ హెలికాప్టర్ ఒకటి బంగాళాఖాతంలో కుప్పకూలింది. అండమాన్ నికోబార్ దీవుల్లోని మాయాబుందర్ సమీపంలో క్రాష్ అయింది. ఈ ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ షార్ట్ ల్యాండింగ్ ఇన్సిడెంట్ లో హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు సిబ్బంది, అయిదుమంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
రన్‌వేకు 300 మీటర్ల దూరంలోనే హెలికాప్టర్ సముద్రంలో పడింది హెలికాప్టర్. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని పవన్ హన్స్ ప్రతినిధి స్పష్టం చేశారు. పోర్ట్ బ్లెయిర్ లోని శ్రీ విజయపురం ఎయిర్ పోర్ట్ నుండి మాయాబుందర్ కు టేకాఫ్ అయిదీ హెలికాప్టర్‌లో ఆ కొద్దిసేపటికే ఇందులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో పైలెట్లు సముద్ర జలాల మీద క్రాష్ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి సహా అందరు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.

24 గంటల వ్యవధిలో ఇది రెండో ప్రమాదం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి ఒక రోజు ముందు అంటే సోమవారం సాయంత్రం జార్ఖండ్‌లోని చత్రాలో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుమంది ప్రాణాలు కోల్పోయారు. రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ నడుపుతున్న బీచ్‌క్రాఫ్ట్ సీ90 ఎయిర్ అంబులెన్స్, రాంచి నుంచి ఢిల్లీకి వైద్య సహాయక విమానంగా వెళ్తుండగా సోమవారం సాయంత్రం కూలిపోయింది.
ఈ క్రాష్ ల్యాండింగ్ సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు శరవేగంగా స్పందించారు. హుటాహుటిన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పోలీస్ మెరైన్ ఫోర్స్ పడవలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. పాక్షికంగా మునిగిన హెలికాప్టర్ వద్దకు చేరుకున్నాయి. ఆందోళనలో ఉన్న అయిదుమంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లను సురక్షితంగా బయటకు తీశారు. వారందరూ కూడా షాక్ లో కనిపించారు. వారికి ఎటువంటి గాయాలు కాలేదు.
పైలట్లు ఈ క్రాష్ ల్యాండింగ్ ను అద్భుతంగా నిర్వహించారని పవన్ హన్స్ తెలిపింది. వారి సమయస్ఫూర్తిని ప్రశంసించింది. హెలికాప్టర్‌ను సముద్రంలో క్రాష్ కాకుండా సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారని, వారి అప్రమత్తత.. అయిదుమంది ప్రాణాలను కాపాడాయని తెలిపింది. ఖాళీ చేసిన వెంటనే హెలికాప్టర్‌లోని వారందరినీ మాయాబుందర్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులు షాక్ లో ఉన్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications