నేపాల్ లో హెలికాప్టర్ కూలిపోయి నలుగురి దుర్మరణం
ఖాట్మండ్: సహాయక చర్యలలో పాల్గోనడానికి వెళ్లిన హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలిపోయిన సంఘటన నేపాల్ లో జరిగింది. నేపాల్ భూకంప బాధితుల పునరావాస కార్యక్రమాలలో పాల్గొనేందుకు వెళ్లిన హెలికాప్టర్ మంగళవారం కుప్పకూలిపోయింది.
నేపాల్ లోని దోలఖా ప్రాంతంలో పునరావాస సామాగ్రిని పంపిణీ చేసిన తరువాత నలుగురు హెలికాప్టర్ లో ఖాట్మండ్ బయలుదేరారు. మార్గం మధ్యలో యమునా దండా గ్రామం సమీపంలో కుప్పకూలిపోయింది.

విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు పురుషులు, ఒక మహిళ ఉన్నారని నేపాల్ అధికారులు చెప్పారు.
యమునా దండా గ్రామం సమీపంలోని షిలా పరబత్ అడువుల్లో హైటెన్షన్ వైర్లు ఏర్పాటు చేశారు. హెలిక్యాప్టర్ హై టెన్షన్ వైర్లు తాకడం వలనే కుప్పకూలి పోయిందని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications